ఎక్కడైనా అదే ప్రెస్టేషన్ : హిందీలో F2 మూవీ

  • Publish Date - March 29, 2019 / 06:50 AM IST

ప్రెస్టేషన్.. ప్రెస్టేషన్.. మనిషిలో కామన్ గా ఉండే పాయింట్ ఆధారంగా తెరకెక్కిన మూవీ ఎఫ్2. సంక్రాంతి బరిలో దిగి బంపర్ హిట్ కొట్టింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరికీ మన్ననలు పొందింది. ప్రెస్టేషన్, అంతేగా అంతేగా అనే డైలాగ్స్ మోస్ట్ పాపులర్ లిస్ట్ లో చేరాయి. ఇంత పెద్ద మూవీకి ఇప్పుడు మరో బంపరాఫర్ వచ్చింది. హిందీలో రీమేక్ చేయబోతున్నారు. రీమేక్ హక్కులు దక్కించుకున్న  బోనీకపూర్.. హిందీకి తగ్గట్టుగా చిన్నచిన్న మార్పులతో కథను రెడీ చేసుకుంటున్నారు.

హిందీలో జాన్ అబ్రహం, ఇలియానా, అనీల్ కపూర్, అర్షద్ వార్సీ, కృతీ కర్బంద, పుల్ కిత్ సామ్రాట్, ఊర్వశీ రైతేలా నటించబోతున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వం చేయబోతున్నాడు. దిల్ రాజు కూడా హిందీ సినిమాకి పార్టనర్ గా వ్యవహరించబోతున్నారు. బోనీతో కలిసి మూవీని తెరకెక్కిస్తున్నాడు. నటీనటులు కూడా డిసైడ్ కావటంతో.. త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.