Aniesh : మొదటి సినిమాకే 40 కోట్ల బడ్జెట్.. ఎన్టీఆర్, నాగార్జున సపోర్ట్.. ఎవరీ కొత్త హీరో..

ఓ కొత్త హీరో సినిమాకు ఈ రేంజ్ సపోర్ట్, ప్రమోషన్, బడ్జెట్ ఏంటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. (Aniesh)

  • Published on- November 7, 2026 / 05:28 PM IST

Aniesh

Aniesh : ఇట్లు అర్జున సినిమాతో అనీష్ రెడ్డి అనే కొత్త హీరో సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమాలోనే మూగవాడిగా నటిస్తున్నాడు అనడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. మలయాళీ కుట్టి అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించడం, కొత్త హీరో మొదటి సినిమాకు తమన్ మ్యూజిక్ ఇచ్చి అన్ని ప్రమోషన్స్ కి రావడం, నాగార్జున ప్రమోషన్స్ కి వచ్చి ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటం, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం.. ఇలా ఓ కొత్త హీరో సినిమాకు ఈ రేంజ్ సపోర్ట్, ప్రమోషన్ ఏంటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

పైగా ఈ సినిమాకు 40 కోట్ల బడ్జెట్ పెట్టారని సమాచారం. ఈ సినిమాతో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారారు. దీంతో ఒక కొత్త హీరోకు ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి, ఇంతమంది సపోర్ట్, గ్రాండ్ రిలీజ్ చేస్తుండటంతో అసలు ఈ అనీష్ రెడ్డి ఎవరు అని చర్చగా మారింది.

Also Read : Mouli Tanuj Prasanth : ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు నాకేం ఇవ్వలేదు.. బాధగా ఉంది.. లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కామెంట్స్ వైరల్..

ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేష్ రెడ్డి చిన్న కుమారుడు ఈ అనీష్ రెడ్డి. మైనింగ్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. రంగాల్లో ఏఎంఆర్ గ్రూప్ హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేష్ రెడ్డి గతంలో నిర్మాతగా నాగార్జున షిర్డీ సాయి, ఓం నమో వెంకటేశాయ సినిమాలను నిర్మించారు. నాగార్జున – మహేష్ రెడ్డి మధ్య స్నేహ సంబంధంతో పాటు వ్యాపార బంధం ఉంది. అందుకే మహేష్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో నాగార్జున అండగా ఉన్నారు.

పెద్ద వ్యాపారవేత్త కొడుకు కావడంతో ఈ సినిమాకు సినీ పరిశ్రమ స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారు. భారీ సాంకేతిక నిపుణులు పనిచేసారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరించినా మహేష్ రెడ్డి బడ్జెట్ పెట్టారని, వెంకీ కుడుముల కేవలం నిర్మాణ బాద్యతలు చూసుకున్నారని సమాచారం. భారీ వ్యాపారవేత్త తనయుడు అనీష్ రెడ్డి మొదటి సినిమా హీరోగా మూగవాడిగా నటిస్తూ సస్పెన్స్ యాక్షన్ సినిమాతో వచ్చి ఎలా మెప్పిస్తాడో, హీరోగా నిలదొక్కుకుంటాడా చూడాలి.

Also Read : Srinivasa Mangapuram : ఫ్లాప్ సినిమాని వంద రోజులు ఆడించిన అభిమానులు..