Anil Ravipudi : మొదలైన అనిల్ రావిపూడి సినిమా.. సంక్రాంతికి రెడీ అవ్వండి..
నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. (Anil Ravipudi)
- Saketh U
- Updated on- June 18, 2026 / 09:58 AM IST
Anil Ravipudi
Anil Ravipudi : చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అంటూ వచ్చి ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయం సాధించిన అనిల్ రావిపూడి తన తర్వాత సినిమాని వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ ప్రకటించాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతిశెట్టి నటిస్తున్నారు ఈ సినిమాలో. నేడు ఈ సినిమా ఓపెనింగ్ కి రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు.. ఇలా స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా వచ్చారు. వెంకటేష్ – కీర్తి సురేష్ – కళ్యాణ్ రామ్ – కృతిశెట్టి లపై అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.
Also See : pooja jhaveri : విజయ్ దేవరకొండ హీరోయిన్ గుర్తుందా? తల్లి కాబోతున్న పూజా ఝవేరి.. బేబీ బంప్ ఫోటోలు..
జూన్ 22 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుందని సమాచారం. బావ బామ్మర్దుల కథ అని టాక్. ఇక ఈ సినిమాని ఎప్పట్లాగే అనిల్ రావిపూడి సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాడు.
