Ranbir Kapoor : యానిమల్ ఆల్ఫా నుంచి ఆదిపురుషుడిగా.. రణబీర్ రామాయణం వివరాలు..

'యానిమల్' సినిమాలో రణబీర్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా కనిపించారు. అలాంటి రోల్ చేసిన రణబీర్.. ఇప్పుడు ఆ పాత్రకి పూర్తి వ్యక్తిరేకమైన సుగుణాభిరాముడి పాత్రని పోషించడానికి రెడీ అయ్యిపోతున్నట్లు తెలుస్తుంది.

Animal Star Ranbir Kapoor is getting ready for do lord Rama role

Ranbir Kapoor : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రీసెంట్ గా ‘యానిమల్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. సందీప్ వంగ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రణబీర్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా కనిపించారు. అలాంటి రోల్ చేసిన రణబీర్.. ఇప్పుడు ఆ పాత్రకి పూర్తి వ్యక్తిరేకమైన సుగుణాభిరాముడి పాత్రని పోషించడానికి రెడీ అయ్యిపోతున్నట్లు తెలుస్తుంది. రణబీర్ రాముడిగా బాలీవుడ్ లో రామాయణం పై మరో సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతం అయ్యినట్లు తెలుస్తుంది.

2024 సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు బి-టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ వైరల్ అవుతున్న వార్తని చూసిన కొందరు నెటిజెన్స్.. “యానిమల్ లో ఆల్ఫా క్యారెక్టర్ చేసిన రణబీర్ నిజంగా ఆదిపురుషుడిగా కనిపించబోతున్నారా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Manchu Vishnu : న్యూజిలాండ్‌లో భార్య కోసం దొంగతనం చేసిన మంచు విష్ణు.. ఏం చేశాడంటే..?

ఇక ఈ పాత్రని పోషించేందుకు రణబీర్ కూడా పూర్తిగా సిద్దమవుతున్నారట. ఇందుకోసం రణబీర్ ఆల్రెడీ మద్యం, నాన్ వెజ్ తినడం మానేశారట. కాగా దంగల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్‌ తివారీ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కనిపించబోతుంటే.. సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నారట. ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు భాగాలుగా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుందట.

 

ట్రెండింగ్ వార్తలు