×
Ad

Aniruda Srikkanth : ఆ నటిని రెండో పెళ్లి చేసుకున్న CSK మాజీ క్రికెటర్.. ఆమెకు కూడా రెండో పెళ్లే..

ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.(Aniruda Srikkanth)

Aniruda Srikkanth

Aniruda Srikkanth : CSK మాజీ క్రికెటర్, ఒకప్పటి ఇండియన్ క్రికెటర్ శ్రీకాంత్ కృష్ణమాచారి తనయుడు అనిరుధ శ్రీకాంత్ తాజాగా రెండో వివాహం చేసుకున్నాడు. తమిళ్ లో కాఫీ విత్ కాదల్, వరిసు, మై డియర్ భూతం.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన నటి సంయుక్త షణ్ముగనాథన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.(Aniruda Srikkanth)

సంయుక్త గతంలో దర్శక నిర్మాత కార్తీక్ శంకర్ ని పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు ఉన్నాడు. ఈ జంట గత సంవత్సరమే విడిపోయారు. ప్రస్తుతం సంయుక్త తన పదేళ్ల కొడుకుతోనే కలిసి ఉంటుంది. సంయుక్త తమిళ్ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. ఇప్పుడు అనిరుధ శ్రీకాంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Also Read : Hema Chandra : నేను ఎందుకు స్పందించాలి? శ్రావణ భార్గవితో విడాకులపై హేమచంద్ర కామెంట్స్ వైరల్..

ఇక అనిరుధ శ్రీకాంత్ చెన్నై, హైదరాబాద్ టీమ్స్ కి ఐపీఎల్ లో ఆడారు. ప్రస్తుతం కామెంటేటర్ గా పనిచేస్తున్నాడు. గతంలో అనిరుధ ఆర్తి వెంకటేష్ అనే మోడల్ ని పెళ్లి చేసుకోగా వీరిద్దరూ ఎప్పుడో విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు సంయుక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

నేడు సంయుక్త షణ్ముగనాథన్ – అనిరుధ శ్రీకాంత్ వారి పెళ్లి ఫొటోలు షేర్ చేయగా పలువురు నెటిజన్లు, తమిళ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also See : Anasuya Bharadwaj : స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చీరకట్టుతో.. అనసూయ అందాలు..