×
Ad

Anirudh: అల్లు అర్జున్ సినిమాకి అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్.. పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మామా

లోకేష్ సినిమా కోసం అనిరుధ్(Anirudh) తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Anirudh taking huge remuneration for Allu Arjun and Lokesh Kanagaraj movie

  • హాట్ టాపిక్ అయిన అనిరుధ్ రెమ్యునరేషన్
  • అల్లు అర్జున్ కోసం భారీగా డిమాండ్
  • స్టార్ హీరోలకు సైతం అందని రేంజ్ లో అనిరుధ్

Anirudh: అనిరుధ్.. ప్రస్తుతం జనరేషన్ లో ఈ పేరు ఒక సంచలనం. తన మ్యాజికల్ మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆయనకీ అలవాటే. అనిరుధ్ మ్యూజిక్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోవడం ఖాయం. మరీ ముఖ్యంగా బీజీఎమ్ ల విషయంలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీల నుంచి వస్తున్న భారీ సినిమాలన్నిటికి అనిరుధ్ నే మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

దీంతో, అనిరుధ్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ చేయాలనీ కోరుకుంటున్నారు. అందుకే, ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా రెమ్యునరేషన్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు అనిరుధ్(Anirudh). అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమాకి అనిరుధ్ నే మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోకి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Akanksha Singh: హాట్ ఫోజులతో హీట్ ఎక్కిస్తున్న ఆకాంక్ష సింగ్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

సోషల్ మీడియాలో ఈ మ్యూజిక్ పై కొన్ని మిలియన్ల రీల్స్ చేశారు అంటే అన్తఘిశయోక్తి కాదు. అంతలా, తన మ్యూజిక్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు అనిరుధ్. అయితే, తాజాగా అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ ల సినిమా కోసం అనిరుధ్ తీసుకుంటున్న రెమ్యునేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా రూ.25 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ తో ఇది సమానం.

సినిమా షూటింగ్ ఆలస్యం అయినందున పవన్ కళ్యాణ్ కేవలం రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అలా ఒక స్టార్ హీరో రేంజ్ లో అనిరుధ్ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.