సౌత్‌కి వెళ్లాను.. నిర్మాత గదిలోకి వెళ్తే అవకాశం ఇస్తామన్నారు
- vamsi
- Published On : March 24, 2021 / 07:32 PM IST
Ankita Lokhande Reveals She Experienced Casting Couch1
టెలివిజన్ ప్రపంచంలో పాపులర్ అవుతోన్న నటి, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి భయానక అనుభవాలను షేర్ చేసుకుంది. అంకితా లోఖండే ఇటీవల గ్లామరస్ పరిశ్రమలోని చీకటి ముఖాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ రోజుల్లో, ఒక సినీ నిర్మాత తనను బలవంతం చేశాడని, అతనికి నటి తగిన సమాధానం ఇచ్చినట్లు వెల్లడించింది.
‘నాకు కేవలం 19-20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, నేను నటనను వృత్తిగా ఎంచుకుని ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. ఆ సమయంలో నన్ను సౌత్ చిత్రాలకు పిలిచారు. నేను వెళ్ళినప్పుడు, ఒక పెద్ద హీరో నన్ను గదికి పిలిచి, మీరు రాజీ పడాలని అన్నారు. అప్పుడు ఆ ప్రశ్నకు నేను తెలివిగా సమాధానం ఇచ్చాను. మీ నిర్మాతతో ఎలా రాజీ పడాలి? నేనేమైనా పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని ప్రశ్నించాను. దీంతో ఆ హీరో ఏమి మాట్లాడలేదు. అతనికి ఒక షేక్‌హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాను.
ఆ సినిమాలో అవకాశం రాదు అని అప్పుడే అర్థమైంది అని ఆమె చెప్పుకొచ్చారు. ఆ స్టార్ హీరో పేరుకాని, నిర్మాత పేరు కానీ అకింత వెల్లడించలేదు. అంకితా లోఖండే కెరీర్ విషయానికొస్తే.. ఆమె నటిగా కంటే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలిగానే ఎక్కువగా అందరికీ తెలిసింది. బాలీవుడ్‌లో మణికర్ణిక, భాగీ3 చిత్రాల్లో అంకిత నటించింది.
