Anna Lezhneva-Pawan Kalyan : ఫస్ట్ టైం జంటగా రష్యా వెళ్లిన ఫోటో.. బయటపెట్టిన పవన్ కళ్యాణ్ భార్య.. తన పేరుపై క్లారిటీ ఇస్తూ..
Anna Lezhneva: తాజాగా అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ఫస్ట్ టైం రష్యా వెళ్ళినప్పుడు దిగిన ఫోటోని షేర్ చేసి తన పేరు గురించి క్లారిటీ ఇస్తూ స్పెషల్ పోస్ట్ చేసారు.
- Saketh U
- Updated on- July 28, 2026 / 11:24 AM IST
Anna Lezhneva Shares Special Photo With Pawan Kalyan
Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్యగా అన్నా లెజినోవా అందరికి పరిచయమే. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫొటోలు, జిమ్, ఫుడ్, ఇండియన్ కల్చర్ కి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ పవన్ అభిమానులకు దగ్గరవుతున్నారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీతో దిగిన పలు ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు అన్నా లెజినోవా.
తాజాగా అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ తో ఫస్ట్ టైం రష్యా వెళ్ళినప్పుడు దిగిన ఫోటోని షేర్ చేసి తన పేరు గురించి క్లారిటీ ఇస్తూ స్పెషల్ పోస్ట్ చేసారు.
Also Read : చై – శోభిత జంటతో బండ్ల గణేష్.. కూతురు పెళ్ళికి ఆహ్వానిస్తూ.. ఫొటోలు..
అన్నా లెజినోవా తన పోస్ట్ లో.. పేరు అనేది చాలా వ్యక్తిగతమైన విషయం. నా పుట్టినరోజు దగ్గరపడుతుండటంతో దీని గురించి రాయడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినప్పటి నుంచి నేను దీని గురించి రాయాలనుకుంటూనే ఉన్నాను. రాసి డిలీట్ చేయడం, మళ్లీ రాయడానికి ప్రయత్నించడం… ఇలా చాలాసార్లు జరిగింది. కానీ దీన్ని ఎలా చెప్పాలో నాకు సరైన విధానం దొరకలేదు. చాలామందికి నేను మొదట ‘అన్నా లెజ్నెవా’ (Anna Lezhneva) గానే పరిచయం అయ్యాను. ఎందుకంటే మా వివాహం గురించి వార్తలు వచ్చినప్పుడు ఆ పేరే ఎక్కువగా వినిపించింది. విచిత్రం ఏమిటంటే ఆ ఇంటిపేరు కనిపించే చివరి అధికారిక పత్రం మా వివాహ ధృవీకరణ పత్రం మాత్రమే. ఆ రోజున నేను నా భర్త ఇంటిపేరును స్వీకరించి ‘అన్నా కొణిదెల’ గా మారాను. కాబట్టి నాదొక చిన్న అభ్యర్థన. దయచేసి నన్ను ‘అన్నా కొణిదెల’ అని పిలవండి. అదే నా పేరు, ఆ పేరుతోనే నేను నిజమైన నాలా భావిస్తాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం. ఈ ఫోటో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు మేము కలిసి వెళ్ళిన మొదటి పర్యటనలో తీసుకున్నాము అని తెలిపారు.
దీంతో ఈ ఫోటో వైరల్ గా మారగా భారతీయ సంప్రదాయం ప్రకారం భర్త ఇంటిపేరుని తన పేరు పక్కన పెట్టుకొని ఇలా పోస్ట్ చేయడంతో మరోసారి అన్నా లెజినోవాని అంతా అభినందిస్తున్నారు.
