Annamalai Rajinikanth : అన్నామలై – రజినీకాంత్ కలిసి కొత్త పార్టీ..? ‘మక్కల్ మడై’ పేరుతో..
తాజాగా అన్నామలై - రజినీకాంత్ కలిసి పార్టీ పెడతారని తమిళనాట ఓ వార్త వైరల్ అవుతుంది. (Annamalai Rajinikanth)
- Saketh U
- Published on- June 6, 2026 / 08:43 PM IST
Annamalai Rajinikanth
Annamalai Rajinikanth : గత కొన్నాళ్లుగా తమిళనాడు రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ పెడతారన్న రజినీకాంత్ చివరిదాకా వచ్చి ఆగిపోవడం, కమల్ హాసన్ DMK పార్టీకి సపోర్ట్, విజయ్ పార్టీ పెట్టి ఏకంగా సీఎం అవ్వడం, తమిళనాడు పవర్ ఫుల్ బీజేపీ లీడర్ ఆ పార్టీకి రాజీనామా ప్రకటించడం.. ఇలా తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
అన్నామలై బీజేపీకి రాజీనామా చేయడంతో సొంత పార్టీ పెడతాడా? ఏ పార్టీలో చేరతాడు అనే చర్చ మొదలయింది. అయితే రజినీకాంత్ తో కలిసి పనిచేస్తాడని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఓ వార్త కూడా వినిపిస్తుంది. అన్నామలై ఆల్రెడీ రజినీకాంత్ కలిశారు. ఆయనతో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు.
Also Read : Kalyani Malik : సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ లైవ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
తాజాగా అన్నామలై – రజినీకాంత్ కలిసి పార్టీ పెడతారని తమిళనాట ఓ వార్త వైరల్ అవుతుంది. ఇటీవల మార్చ్ నెలలో రజినీకాంత్ భార్య లత తాము చేయబోయే సేవా సంస్థల గురించి ప్రకటిస్తూ ‘మక్కల్ మడై’ అనే ఓ వేదికని ప్రకటించారు. ప్రజల సమస్యలు వినడానికి, మహిళలు, పిల్లలు, వెనకబడ్డ వర్గాల కోసం పోరాటం చేయడానికి ఈ మక్కల్ మడై ముందుంటుందని ఆమె ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడానికి ఈ మక్కల్ మడై అని రజినీకాంత్ భార్య ప్రకటించారు. దీనికి ఎలాంటి రాజకీయ కారణం లేదని అన్నారు. అయితే అప్పట్లో ఎన్నికల హడావిడిలో ఈ సంస్థని ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు అదే మక్కల్ మడై పార్టీగా మారబోతుందని అంటున్నారు. గతంలో రజినీకాంత్ రజిని మక్కల్ మడై అనే పేరుతోనే పార్టీ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు అదే పేరుతో స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసారు. అన్నామలై రజినీకాంత్ కలుస్తారని, ఈ మక్కల్ మడై ని పార్టీగా మార్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తమిళ మీడియా అంటుంది.
Also Read : Annamalai: అన్నామలై ‘వుయ్ ద లీడర్స్’ ఉద్యమం.. ఒక్కరోజులోనే 14 లక్షల మంది సపోర్ట్
అన్నామలై బీజేపీకి రాజీనామా చేసినా ఆయన సిద్ధాంతాలు ఆ పార్టీకి సపోర్ట్ గానే ఉంటాయి. రజినీకాంత్ కూడా బీజేపీకి సపోర్ట్ గా ఉంటారు. దీంతో వీరిద్దరూ కలిసి మక్కల్ మడై అనే పార్టీ పెట్టినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తారని తమిళ రాజకీయాల్లో వినిపిస్తుంది. ఇప్పుడే విజయ్ ఒక్కసారిగా ఎదిగి సీఎం అయ్యాక మరి అన్నామలై – రజినీకాంత్ కలిసి నిజంగానే పార్టీ పెడతారా? లేక ఎవరికైనా మద్దతు ఇస్తారా? ఈ మక్కల్ మడై ఏం చేస్తుంది అని తమిళనాట చర్చగా మారింది.
