Sravan Bhargavi : సింగర్ శ్రావణి భార్గవిపై అన్నమయ్య వంశస్థులు సీరియస్.. కోర్టుకు వెళ్తామని హెచ్చరిక..
ఎన్నో పాటలతో ప్రేక్షకులని అలరించిన శ్రావణ భార్గవి కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో తన వీడియోలతో కూడా మెప్పిస్తుంది. అయితే ఇటీవల శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన అయిన............
- Saketh U
- Published On : July 20, 2022 / 06:44 AM IST
Sravana Bhargavi
Sravan Bhargavi : టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. ఎన్నో పాటలతో ప్రేక్షకులని అలరించిన శ్రావణ భార్గవి కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో తన వీడియోలతో కూడా మెప్పిస్తుంది. అయితే ఇటీవల శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన అయిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై..’ అనే కీర్తనకి వీడియో చేసి తన యూట్యూబ్ లో పెట్టింది. ఈ వీడియోలో తన అందాన్ని అభివర్ణిస్తున్నట్టుగా ఆ సంకీర్తనని పాడింది.
Prabhas: రామోజీ ఫిలిం సిటీలో ప్రాజెక్ట్-K సందడి!
అయితే ఈ వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీరియస్ అయ్యారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి ఇలా తన అందాన్ని చూపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి వీడియో చేయడం చాలా తప్పని ఆగ్రహించారు. అయితే ఇదే విషయంపై శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె సరిగ్గా సమాధానమివ్వలేదని, ఈ విషయంలో శ్రావణ భార్గవి చాలా బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తుందని హరినారాయణ చార్యులు తెలిపారు. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని ఆయన అన్నారు.
