Rgv
RGV : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఎన్ని వివాదాలలో చిక్కుకున్నా, ఆయన మాట్లాడే మాటలతో ఎవర్నైనా ప్రభావితం చేస్తారు. డైరెక్టర్ గా ఎన్నో మంచి సినిమాలని అందించారు. ఎంతో మందిని ఇండస్ట్రీలో స్టార్స్ చేశారు. ఆయన ఫిలాసఫీతో మాట్లాడే మాటలు ఎంతోమందిని ఆకర్షితులని చేశాయి. ఇప్పటికి కూడా రాముఇజం పేరుతో ఆయన యూట్యూబ్ లో పెట్టే వీడియోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయన ట్విట్టర్ లో చేసే ట్వీట్స్ పక్కన పెడితే అయన ఒక గొప్ప డైరెక్టర్ తో పాటు గొప్ప ఫిలాసఫర్.
ఇప్పటికే ఆర్జీవీపై నాలుగు పుస్తకాలు వచ్చాయి. ఆర్జీవీ రాసిన ‘నా ఇష్టం’, ‘చెంప దెబ్బ ఫిలాసఫీ’, సిరాశ్రీ రాసిన ‘వోడ్కా విత్ వర్మ’, రేఖ పర్వతాల రాసిన ‘వర్మ మన ఖర్మ’ పుస్తకాలు ఇప్పటికే అనేక సంఖ్యలో అమ్ముడుపోయాయి. తాజాగా వర్మ పై రాసిన మరో బుక్ రిలీజ్ అవ్వనుంది.
RGV : ‘భీమ్లా నాయక్’ విడుదలపై ఆర్జీవీ ట్వీట్.. ‘పుష్ప’ని బీట్ చేస్తాడా అంటూ.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు
కంత్రిసా అనే డ్రాయింగ్ ఆర్టిస్ట్ తన స్వహస్తాలతో గీసి రాశారు ఈ పుస్తకాన్ని. మొత్తం పుస్తకం చేత్తోనే రాసి రచించారు. దానినే బుక్ గా మలిచారు. ‘ఆర్జీవీ ది బ్లు బుక్’ అనే పేరుతో ఈ పుస్తకం రాబోతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి చేత్తో రాసిన పుస్తకం అని ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పుస్తకం ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ‘ఆర్జీవీ ది బ్లు బుక్’ పుస్తకాన్ని ఫిబ్రవరి 18న హైదరాబాద్ శిల్ప రామంలో ఆర్జీవీ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు.
ఆర్జీవీ కూడా ఈ బుక్ ని ప్రమోట్ చేస్తూ, ఆ రైటర్ ట్యాలెంట్ ని పొగుడుతూ ట్విట్టర్ లో అనేక పోస్టులు చేశారు. ఆర్జీవీ అభిమానులు ఈ పుస్తకం కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
No I am not involved in the publication of RGV’S BLUE BOOK ..it’s done by the artiste @iamkanthrisa himself in coloboration with iview entertainments for whatever reasons he likes and hates me .. Book Launching on Feb 18th 5 pm at rock heights, shilparamam. pic.twitter.com/YIhTdoCaHf
— Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2022
— Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2022