Kannappa : మంచు విష్ణు కన్నప్పలో మరో స్టార్ హీరో ఎంట్రీ.. ఎవరో తెలుసా..?

మంచు విష్ణు కన్నప్ప మూవీలోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు..?

another star hero is entered into Manchu Vishnu Kannappa Movie

Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’లోకి సౌత్ లోని టాప్ స్టార్స్ అంతా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, నయనతార, మలయాళం స్టార్ హీరో మోహ‌న్‌లాల్‌, మధుబాల నటిస్తున్నట్లు ఒకే అయ్యింది. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈ మూవీలో నటించబోతున్నాడట. దీంతో ఈ సినిమా పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు..?

కన్నడ స్టార్ హీరో ‘శివ రాజ్ కుమార్’ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడట. ఈ మూవీలో శివన్న ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నాడట. ఈ విషయాన్ని మంచి విష్ణు కూడా.. ‘హరహర మహాదేవ్’ అంటూ కన్ఫార్మ్ చేశాడు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ నుంచి స్టార్స్ ని తీసుకోవడం అయ్యిపోయింది. ఇప్పుడు హిందీ వంతు వచ్చింది. మరి బాలీవుడ్ నుంచి ఏ స్టార్ ఈ సినిమాలో భాగం అవుతాడో చూడాలి. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా ముందుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ‘నుపుర్ సనన్’ తీసుకున్నారు.

Also read : Mahesh Babu : మహేష్ బాబు కొత్త జిమ్ ఫోటో చూశారా..? ఏం కండలురా బాబు..!

కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి సడన్ తప్పుకోవడంతో.. ఇప్పుడు ఆ రోల్ కోసం మరొకరిని వెతకాల్సి వస్తుంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకర్షించడానికి అన్ని బాషల స్టార్స్ ని కవర్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈ మూవీని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మోహన్ బాబు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్ లో ఈ మూవీ షూటింగ్ మొత్తం జరగనుంది. ఇటీవలే అక్కడికి దాదాపు 8 కంటైనర్లలో షూటింగ్ కావాల్సిన ప్రాపర్టీ అంతా తరలించారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు