Anumana Pakshi Trailer : ‘అనుమాన పక్షి’ ట్రైలర్ రిలీజ్.. ఇన్ని అనుమానాలు ఏంటి భయ్యా నీకు..
మీరు కూడా ఈ అనుమాన పక్షి ట్రైలర్ చూసేయండి.. (Anumana Pakshi Trailer)
- Saketh U
- Updated on- September 14, 2026 / 04:20 PM IST
Image Credits : T Series Telugu You Tube Channel
Anumana Pakshi Trailer : రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా తెరకెక్కుతున్న సినిమా అనుమాన పక్షి. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మాణంలో డిజె టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘అనుమాన పక్షి’ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రిన్స్ సెసిల్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇందులో హీరో ఓవర్ థింకింగ్ చేస్తూ, బోలెడన్ని అనుమానాలతో ప్రతి విషయాన్ని కాంప్లికేట్ చేసుకుంటాడని తెలుస్తుంది. ఈ సినిమాని చాలా భాగం వరకు కాశ్మీర్ లో షూట్ చేసారని తెలుస్తుంది. ట్రైలర్ అయితే కామెడిగానే మెప్పించింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also See : Rithu Chowdary : ఫ్యామిలీతో కలిసి రీతూ చౌదరి వినాయకచవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
మీరు కూడా ఈ అనుమాన పక్షి ట్రైలర్ చూసేయండి..
