Celebrating ANR 100 : అక్కినేని కోసం వచ్చిన బాలీవుడ్ స్టార్ నటుడు..
నేడు ఏఎన్నార్ 100వ జయంతి వేడుక నేడు ఘనంగా జరిగింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ ఈవెంట్ కి బాలీవుడ్ నుంచి..
- gum 95921
- Published On : September 20, 2023 / 02:43 PM IST
Anupam Kher at Akkineni Nageswara Rao 100thi birthday celebration event
Celebrating ANR 100 : ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక లెజెండ్ గా ఎదిగిన నటుడు ‘అక్కినేని నాగేశ్వరరావు’ (Akkineni Nageswara Rao). 1924 సెప్టెంబర్ 20న జన్మించిన ఏఎన్నార్.. 100వ జయంతి వేడుక నేడు ఘనంగా జరిగింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లో అక్కినేని ఫ్యామిలీ ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులంతా కలిసి దగ్గరుండి జరిపించారు.
Actor Navdeep : సినీ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్.. పిటిషన్ కొట్టివేత
ఈ వేడుకకు సినీ ప్రముఖలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక టాలీవుడ్ నుంచి మోహన్ బాబు, మురళి మోహన్, జగపతిబాబు, బ్రహ్మానందం, మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచి విష్ణు.. తదితరులు హాజరయ్యి ఏఎన్నార్ కి నివాళులు అర్పించారు. ఇక ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా హాజరయ్యాడు. కార్తికేయ 2 చిత్రం తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన అనుపమ్ ఖేర్ ప్రస్తుతం పలు తెలుగు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ వస్తున్నాడు.
Charan – Mahesh : అక్కినేని నాగేశ్వర రావు కోసం ఒకే వేదికపై రామ్ చరణ్, మహేష్ బాబు..
Celebrating ANR 100 Years Unveiling Idol at Annapurna Studios
Celebrating ANR 100 Years Unveiling Idol at Annapurna Studios
నేడు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఏఎన్నార్ కి నివాళులు అర్పించడం అందర్నీ ఆకర్షించింది. నేషనల్ వైడ్ ఇమేజ్ ఉన్న అనుపమ్ ఖేర్ బాలీవుడ్ నుంచి ఏఎన్నార్ కోసం ఇక్కడి వరకు రావడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగార్జునతో అనుపమ్ ఖేర్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదే ఈవెంట్ లో రామ్ చరణ్, మహేష్ బాబు కలయిక అందర్నీ ఆకట్టుకుంది. ఇద్దరు కలిసి పక్కపక్కన కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
