Hyderabad : బ్రేకప్ తర్వాత.. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న స్టార్ హీరోయిన్..

తాజాగా మరో హీరోయిన్ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటుందట. (Hyderabad)

  • Published on- October 16, 2026 / 02:38 PM IST

Hyderabad

Hyderabad : టాలీవుడ్ లో నటించే చాలా మంది హీరోయిన్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లే. ఇక్కడ వరుస సినిమాలు చేసి, ఇక్కడ మంచి స్టార్ డమ్ తెచ్చుకుంటూ పలువురు హీరోయిన్స్ ఇక్కడే ఇల్లు కట్టుకొని, ఇక్కడే బిజినెస్ లు చేస్తూ సెటిల్ అయిపోతున్నారు. తాజాగా మరో హీరోయిన్ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటుందట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఇటీవల కొన్ని రోజల క్రితమే అనుపమ ఓ తమిళ హీరోతో లవ్ బ్రేకప్ అయి డిప్రెషన్ లోకి వెళ్లి బయటకు వచ్చిందని వార్తలు వచ్చాయి. ఆమె కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అనుపమ నేడు క్రేజీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also See : Inaya Sulthana : బీచ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఇనయా సుల్తానా.. ఫొటోలు వైరల్..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తెలుగులో నేను వరుసగా సినిమాలు చేశాను. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. తెలుగులో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. నేను ఇక్కడే సెటిల్ అవుతానేమో. ఆల్రెడీ హైదరాబాద్ లో ఓ ఇల్లు తీసుకున్నాను. అది కన్‌స్ట్రక్షన్ లో ఉంది. త్వరలోనే పూర్తయ్యాక షిఫ్ట్ అవుతాను. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కొచ్చి అంటూ తిరుగుతున్నాను అని తెలిపింది.

దీంతో అనుపమ త్వరలోనే హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుందని తెలుస్తుంది. హైదరాబాద్ ORR దగ్గర్లో లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకొని తనకు తగ్గట్టు కన్‌స్ట్రక్షన్ చేయించుకుంటుందని సమాచారం.