Anurag Kashyap: బలవంతంగా బీఫ్ తినిపిస్తారా.. కేరళ స్టోరీ మూవీపై అనురాగ్ షాకింగ్ కామెంట్స్
ది కేరళ స్టోరీ 2 సినిమా ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap).
- V Santhosh Kumar
- Published On : February 23, 2026 / 06:46 AM IST
Anurag Kashyap shocking comments on The Kerala Story 2 movie.
Anurag Kashyap: ది కేరళ స్టోరీ.. 2023లో వచ్చిన ఈ సినిమా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై చాలా వివాదాలు తలెత్తాయి. ఇప్పుడు అదే కోవలో వస్తున్న సినిమా ది కేరళ స్టోరీ 2. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించి ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ayesha Khan: అయ్యో అది నేను కాదు.. దయచేసి నమ్మకండి.. దురంధర్ బ్యూటీ పేరుతో ఫేక్ అకౌంట్ దందా
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. దీనిపై ఇప్పటికే కేరళలో వివాదం రాజుకుంది. కేరళ అధికార కమ్యూనిస్ట్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ది కేరళ 2 సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక సీఎం పినరయి విజయన్ సైతం ఈ సినిమాపై మండిపడుతున్నాడు. కేరళలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని, ఈ రాష్ట్రాన్ని ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నాలను జరుగుతున్నాయని, దానిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) చేరాడు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమా ద్వారా సమాజాన్ని విభజించాలనే ప్రయత్నం జరుగుతోంది. కేవలం డబ్బు సంపాదించడానికి తీసిన ఒక ప్రాపగండా సినిమా ఇది. ట్రైలర్‌లో ఒక ముస్లిం కుటుంబం, హిందూ అమ్మయికి బలవంతంగా బీఫ్ తినిపించడాన్ని చూపించారు. నిజ జీవితంలో ఎవరూ అలా చేయరు. కనీసం కిచిడీ కూడా ఎవరూ బలవంతంగా తినిపించరు. ఈ సినిమా ప్రజలను విడదీసేలా ఉందని, వాస్తవాలకు దూరంగా ఉందని” ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
