Ayesha Khan: అయ్యో అది నేను కాదు.. దయచేసి నమ్మకండి.. దురంధర్ బ్యూటీ ఫేక్ అకౌంట్ దందా
దురంధర్ బ్యూటీ అయేషా ఖాన్(Ayesha Khan) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Ayesha Khan warns against her fake account
Ayesha Khan; బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. ఇక దురంధర్ సినిమా రిలీజ్ తరువాత ఈ అమ్మడుకు ఫాలోయింగ్ చాలా పెరిగింది. దురంధర్ సినిమాలో కేవలం ఒక సాంగ్ లో కనిపించి ఆ రేంజ్ లో రచ్చ చేసింది ఈ బ్యూటీ. అయితే, ఆ ఫేమ్ నే కొంతమంది సైబర్ నేరగాళ్లు ఒక రేంజ్ లో వాడేస్తున్నారు. అయేషా ఖాన్(Ayesha Khan) పేరుపై ఫేక్ వాట్సప్ అకౌంట్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఇక ఆ సినిమా ఇప్పట్లో లేనట్టే
ఇక ఈ విషయం అయేషా వరకు చేరడంతో ఆమె స్పందించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయేషా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ ఫేక్ అకౌంట్ కి సంబందించిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ లను సైతం షేర్ చేసింది. ‘ఇది నా అకౌంట్ కాదు. దయచేసి ఇలాంటి మెసేజ్‌లను నమ్మకండి” అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు, ఆ ఫేక్ అకౌంట్ కి సంబందించిన ఫోన్ నంబర్‌ను కూడా ఆమె షేర్ చేసింది. ఇలాంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించింది.
ప్రస్తుతం అయేషా చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక అయేషా ఖాన్ విషయానికి వస్తే, కేవలం ఆమె హిందీలోనే కాదు తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. ముఖచిత్రం ఆమె మొదటి సినిమా కాగా.. ఆ తరువాత మనమే, ఓం భీం బుష్, లక్కీ భాస్కర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాల్లో నటించింది. రీసెంట్ గా వచ్చిన దురంధర్ సినిమాలో ఐటెం సాంగ్ వల్ల ఆమె పాపులర్ అయ్యింది.
