ఇదంతా పాతికేళ్ల అమ్మాయే చేసిందా? అనుష్క అదరగొట్టింది..

అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Publish Date - March 6, 2020 / 07:24 AM IST

అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

స్వీటీ అనుష్క, విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలిం.. ‘నిశ్శబ్దం’.. (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలిసి వర్క్ చెయ్యడాన్ని క్రాస్ఓవర్ అంటారు).. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి..

శుక్రవారం ‘నిశ్శబ్దం’ థియేట్రికల్ ట్రైలర్ నేచురల్ స్టార్ నాని (తెలుగు), జయం రవి (తమిళ్), మనోజ్ బాజ్‌పేయి (హింది)రిలీజ్ చేశారు. 1:25 నిమిషాల నిడివిగల ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అనుష్క మరోసారి తన నటనతో ఆకట్టుకోనుందని అర్థమవుతుంది. వినికిడి లోపం మరియు మాట్లాడలేని సాక్షి అనే పెయింటర్ పాత్రలో అనుష్క నటన హైలెట్‌గా ఉంటుందని మూవీ టీమ్ చెప్తుంది. అనుష్క నివసిస్తున్న ఇంట్లో జరుగుతున్న విపత్కర పరిస్థితులకు సాక్షి స్నేహితురాలు సోనాలి(షాలినిపాండే) కారణం అని చూపించారు.

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. మాధవన్ మ్యుజిషియన్‌గా, అంజలి క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్‌గా కనిపించారు.. ‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడిసన్ నెగెటివ్ క్యారెక్టర్ చేశారు.. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో ఏప్రిల్ 2న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో  విడుదల చేయనున్నారు.  సంగీతం : గోపి  సుందర్, నిర్మాతలు : కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్. (‘అహం బ్రహ్మాస్మి’.. సీతా రామరాజు క్లాప్..)