Pawan Kalyan : మొదటిసారి సర్జరీ వివరాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇంకా బ్లీడింగ్, ఇంకో సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్యలు, శస్త్ర చికిత్స వివరాలు చంద్రబాబుకు తెలిపారు. దీంతో పవన్ ప్రతినిధులు ఈ వివరాలను అధికారికంగా ప్రకటించారు. (Pawan Kalyan)

  • Published on- May 2, 2026 / 10:14 PM IST

Pawan Kalyan

Pawan Kalyan : ఇటీవల పవన్ కళ్యాణ్ కి ముక్కుకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిందని, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని అధికారికంగా ప్రకటించారు. గత వారం రోజుల నుంచి పవన్ బయటకు కూడా రాకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నేడు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలిసి పరామర్శించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్యలు, శస్త్ర చికిత్స వివరాలు చంద్రబాబుకు తెలిపారు. దీంతో పవన్ ప్రతినిధులు ఈ వివరాలను అధికారికంగా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. సైనస్ సంబంధిత ఇబ్బందిగా భావించినా అది తీవ్ర సమస్యగా పరిణమించిందని, ఇన్ఫెక్షన్ గా మారి కంటిపై ప్రభావం చూపడంతో శస్త్ర చికిత్స చేశారని తెలిపారు. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఫెస్) చేసినట్లు చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఇప్పటికీ కొంత మేరకు నాసల్ బ్లీడింగ్ ఉందని, మరో వారం రోజులలో తగ్గుతుందని డాక్టర్లు చెప్పినట్టు తెలిపారు. అలాగే సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలలో తగిలిన గాయాలను అప్పట్లో పట్టించుకోలేదని అవి కూడా ఇప్పుడు బాధిస్తున్నాయని వివరించారు. భుజం దగ్గరి మజిల్ కి గాయాలు గత అయిదేళ్ల నుంచి ఉన్నాయని, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ ఉందని, పవన్ కళ్యాణ్ గతంలో వైద్యంపై పూర్తి శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పుడు అవి తిరగబెడుతున్నాయని, వీటికి సంబంధించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, మరో శస్త్ర చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పినట్టు తెలిపారు.

Also See : Chandrababu- Pawan: పవన్ నివాసానికి చంద్రబాబు.. శస్త్రచికిత్స తర్వాత పరామర్శించిన ముఖ్యమంత్రి.. ఫొటోలు

దీంతో పవన్ కళ్యాణ్ ఇన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో సర్జరీ కూడా చేయాల్సి ఉందని తెలియడంతో అది కూడా జరిగి పవన్ త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు, అభిమానులు కోలుకుంటున్నారు.