Chandrababu- Pawan: పవన్ నివాసానికి చంద్రబాబు.. శస్త్రచికిత్స తర్వాత పరామర్శించిన ముఖ్యమంత్రి.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Chandrababu- Pawan)గారిని కలిశారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ను పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పవన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీనికి సంబందించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.





