Nara Lokesh-Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్
Nara Lokesh Wishes Jr NTR : తారక్ పుట్టిన రోజు సందర్భంగా నారా లోకేష్.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
- Dharani Pilli
- Updated on- May 20, 2026 / 05:41 PM IST
AP Minister Nara Lokesh extends birthday wishes to jr ntr
Nara Lokesh-Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు (మే 20, బుధవారం). బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ సెలబ్రిటీలు, అభిమానులు తారక్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు తెల్లవారుజాము నుంచే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
తారక్ బర్త్ డే సందర్భంగా నారా లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. “తారక్.. నీకు మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు, విజయం ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు.
Heartfelt birthday wishes to @tarak9999. May God bless you with good health and success.
— Lokesh Nara (@naralokesh) May 20, 2026
ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. మే 20న అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హైదరాబాద్ సిటీలోని ఎన్టీఆర్ ఇంటి వద్ద పరిసర ప్రాంతాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులతో జనసంద్రంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది అభిమానులు తారక్ బర్త్ డే సందర్భంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ.. బాణసంచా కాల్చారు. తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు అర్ధరాత్రి రోడ్ల మీదనే ఎదురు చూశారు. అభిమానులు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన తారక్ స్వయంగా బయటకు వచ్చి అందరికీ నమస్కరిస్తూ ఆనందం పంచుకున్నారు.
Also Read – Jr NTR Childhood: జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. చిన్నప్పటి స్పెషల్ ఫోటోలు చూశారా..?
ఇదిలా ఉంటే తారక్ బర్త్ డే సందర్భంగా మంగళవారం రాత్రి ‘డ్రాగన్’ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేస్తూ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
