×
Ad

Barabar Premistha : యాటిట్యూడ్ స్టార్ వచ్చేస్తున్నాడు.. బరాబర్ ప్రేమిస్తా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. (Barabar Premistha)

Barabar Premistha

Barabar Premistha : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాణంలో సంపత్ రుద్ర దర్శకత్వంలో మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసారు.(Barabar Premistha)

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. హైదరాబాద్ లోని ఓ కాలేజీలో ఈవెంట్ నిర్వహించి ఫిబ్రవరి 6న ఈ బరాబర్ ప్రేమిస్తా సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

Also Read : Cheekatilo Review : శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ మూవీ రివ్యూ.. పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..

ఈ సందర్భంగా హీరో చంద్రహాస్‌ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 6న బారాబర్ ప్రేమిస్తా సినిమాతో విక్టరీ కొట్టబోతున్నాం అని నమ్మకంగా చెబుతున్నా అని అన్నారు. డైరెక్టర్ సంపత్ రుద్ర మాట్లాడుతూ.. ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొట్టుకుంటే ఎలా ఉంటుంది అని తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఈ బారాబర్ ప్రేమిస్తా అని తెలిపారు.

ఈ సినిమాలో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.

Also See : Nari Nari Naduma Murari : ‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ ఈవెంట్.. గెస్ట్ గా హాజరయిన విజయవాడ ఎంపీ..