Ariyana Glory
Ariyana Glory : ఇటీవల నటుడు శివాజీ దండోరా సినిమా ఈవెంట్లో అమ్మాయిలు, హీరోయిన్స్ చక్కగా చీరలు కట్టుకోండి, మంచి బట్టలు వేసుకోండి అని చెప్తూ పొరపాటున ఓ రెండు పదాలు అసభ్యకరంగా మాట్లాడటంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇంకేముంది కొంతమంది శివాజీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.(Ariyana Glory)
అమ్మాయిలకు మీరెవరు చెప్పడానికి, అమ్మాయిలపై మీ కంట్రోల్ ఏంటి అంటూ పలువురు సెలబ్రిటీలు శివాజీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం శివాజీ పదాలు తప్పుగా వాడినా మంచి విషయమే చెప్పాడు అని సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి, యాంకర్ అరియనా గ్లోరీ శివాజీకి సపోర్ట్ గా మాట్లాడింది.
Also Read : Saanve Megghana : అక్క హీరోయిన్ – తమ్ముడు హీరో.. ఇద్దరూ హిట్స్ కొట్టి.. వీళ్ళ గురించి తెలుసా..?
అరియనా గ్లోరీ తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిల డ్రెస్సింగ్, శివాజీ కామెంట్స్ గురించి చర్చకు వచ్చింది.
దీనిపై అరియనా గ్లోరీ మాట్లాడుతూ.. శివాజీ గారి ఉద్దేశం కరెక్ట్. కానీ ఆయన మాట్లాడిన పదాల వల్ల వైరల్ అవుతుంది. అంతే కానీ ఆయన ఉద్దేశం మంచిగా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి అని. ఎవరి ఉద్దేశం వాళ్ళది. మా ఇంట్లో అమ్మ కూడా కొన్ని చెప్తుంది అలాగే. ఆయన ఉద్దేశం కూడా కరెక్ట్ కానీ అది వేరేలా వెళ్ళింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు కానీ తీసుకునేవాళ్లను బట్టి ఉంటుంది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఇప్పుడు పద్దతిగా మాట్లాడి బయట ఎక్కడో ఎలాగో ఉన్నాను అనుకో నన్ను ట్రోల్ చేస్తారు అని తెలిపింది. దీంతో అరియనా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Ariyana Glory : అమర్ దీప్ వల్లే నా మతం మారింది.. పళని సుబ్రహ్మణ్య స్వామి నా జీవితాన్ని మార్చేశాడు..