×
Ad

Arjun Rampal : NBK 108 కోసం బాలీవుడ్ హీరో.. బాలయ్య బాబు వర్సెస్ అర్జున్ రాంపాల్..

బాలయ్య బాబు హీరో అంటే విలన్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండాల్సిందే. అందుకు బాలీవుడ్ నుంచి ఒకప్పటి హీరోని తీసుకొచ్చారు. బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేస్తున్న అర్జున్ రాంపాల్ ని బాలయ్య బాబుకి విలన్ గా తీసుకొచ్చారు.

  • Published On : May 10, 2023 / 11:21 AM IST

Arjun Rampal playing opposite to Balakrishna in NBK 108

Arjun Rampal :  బాలకృష్ణ(Balakrishna) ఇటీవల అఖండ(Akhanda) సినిమా, అన్‌స్టాపబుల్ షో(Unstoppable), వీరసింహారెడ్డి(Veerasimha Reddy) సినిమా, వరుస యాడ్స్.. ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి అభిమానులను జోష్ లో ఉంచారు బాలయ్య బాబు. ఇదే జోష్ లో NBK 108 సినిమాను శరవేగంగా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్ గా, శ్రీలీల(Sreeleela) బాలయ్య కూతురి పాత్రలో NBK 108 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఈ సారి కామెడీ కాదంటూ బాలయ్యతో సినిమా తీస్తుండటం, బాలకృష్ణ వరుస విజయాలతో జోరులో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవల కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలయ్య బాబు హీరో అంటే విలన్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండాల్సిందే. అందుకు బాలీవుడ్ నుంచి ఒకప్పటి హీరోని తీసుకొచ్చారు. బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేస్తున్న అర్జున్ రాంపాల్ ని బాలయ్య బాబుకి విలన్ గా తీసుకొచ్చారు.

Adipurush : మరో వివాదంలో ఆదిపురుష్.. చిత్రయూనిట్ పై ఫైర్ అవుతున్న యూట్యూబర్స్..

చిత్రయూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అర్జున్ రాంపాల్ అనిల్ రావిపూడితో బాలయ్య డైలాగ్ ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని చెప్పి అలరించాడు. బాలయ్యకు విలన్ గా చేయబోతున్నాడని ప్రకటించారు. NBK 108 సినిమాలో బాలయ్య బాబుతో అర్జున్ రాంపాల్ తలపడనున్నట్టు తెలుస్తుంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేస్తారని ఆల్రెడీ ప్రకటించారు. అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు.