×
Ad

Danny : ఇదేదో మరో అర్జున్ రెడ్డిలా ఉందే.. ఆశీష్ గాంధీ డానీ..

తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేసారు. (Danny)

  • Published On : February 15, 2026 / 09:30 PM IST

Ashish Gandhi

Danny : కొల్లి గోపాల కృష్ణ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జి గోగణ పిక్చర్స్ బ్యానర్స్ పై కళ్యాణ్‌జి గోగణ, రిజ్వాన్, కుషి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘డానీ’. వెల్కమ్ టు లవ్ జంగిల్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ఆశీష్ గాంధీ హీరోగా నటించాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేసారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. రా అండ్ రస్టిక్ సినిమాల్ని ఆదరిస్తున్న ఈ సమయంలో డానీ ఫస్ట్ లుక్ పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. హీరో రగ్డ్ లుక్, జుట్టు, గడ్డం, బాడీ, హీరోయిన్ కాళ్లతో సిగరెట్ పట్టుకోవడం, దాన్ని హీరో తాగడం డిఫరెంట్‌గా ఉంది. పోస్టర్‌లోనే ఇంత వైవిధ్యం కనిపిస్తుంటే సినిమా అర్జున్ రెడ్డిని మించి ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాని జూన్ 26న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Vishwambhara : అసలు సినిమా వేరు.. నిర్మాత కామెంట్స్ వైరల్.. ఒక్కసారిగా ‘విశ్వంభర’పై మారిన అంచనాలు..