Vishwambhara : అసలు సినిమా వేరు.. నిర్మాత కామెంట్స్ వైరల్.. ఒక్కసారిగా ‘విశ్వంభర’పై మారిన అంచనాలు..
నేడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలతో విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (Vishwambhara)
Vishwambhara
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా ఎప్పుడో రావాలి. కానీ గ్రాఫిక్స్ వల్ల లేట్ అవుతుంది. ఇప్పటికే విశ్వంభర టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేయగా దీనిపై గ్రాఫిక్స్ బాగోలేవంటూ ట్రోల్స్ వచ్చాయి. దీంతో సినిమాని రీ షూట్ చేయడం, CG వర్క్ మరింత బెటర్ చేయడం కోసం వాయిదాలు వేస్తున్నారు. గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి జులై 9న రావడానికి రెడీ అయింది.(Vishwambhara)
ఈ సినిమా టీజర్ విజువల్స్ చూసాక కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ నేడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలతో విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Ravi Varma : ఎన్టీఆర్ నీ కాళ్ళు పట్టుకోవాలా అని అడిగారు.. ఆయన ఎలాంటి వాడంటే.. రవివర్మ కామెంట్స్..
కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ మీట్ లో ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. మొన్ననే నేను విశ్వంభర ట్రైలర్ చూసాను. అదిరిపోయింది. మనం ఇప్పటివరకు చూసిన సినిమా వేరు, అసలు సినిమా పూర్తిగా వేరు. చాలా దాచిపెట్టారు. నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది సినిమా. ట్రైలర్ చూడగానే నాకు హై ఫీల్ వచ్చింది. ఈ సంవత్సరం బైకర్, విశ్వంభర సినిమాలతో UV క్రియేషన్స్ నెంబర్ 1 బ్యానర్‌గా నిలుస్తుంది అని అన్నారు. అలాగే విశ్వంభర సినిమాని నేను డిస్ట్రిబ్యూట్ చేయలేను. దానికి నా స్థాయి సరిపోదు. నాలాంటి పదిమంది కలిసి మోయాలి. నేనొక్కడ్నే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేను అని అన్నారు. దీంతో విశ్వంభర థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా అవుతుందని తెలుస్తుంది.
దీంతో ధీరజ్ వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ విశ్వంభర సినిమాపై అంచనాలు పెట్టుకొని ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ వస్తే కానీ విశ్వంభర పై మరింత క్లారిటీ రాదు. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సోషియో ఫాంటసీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి.. పలువురు హీరోయిన్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు
