Danny : ‘డానీ’.. రొమాంటిక్ క్రైమ్ డ్రామా రిలీజ్ డేట్ అనౌన్స్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. (Danny)

  • Published on- October 16, 2026 / 03:39 PM IST

Ashish Gandhi Danny

Danny : ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా డానీ. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌ల పై రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.

ప్రేమకు, అలవాటుకు మధ్య ఉండే సంఘర్షణతో, జీవితంలో ఓ వ్యక్తికి ఉన్న అలవాట్లు, ఆ అలవాట్ల కారణంగా ఎలాంటి స్థితికి వెళ్లాడు.. ప్రేమలో పడ్డాక జీవితం ఎలా మారింది.. ఆ అలవాట్లకు, ఈ ప్రేమకు మధ్య ఏర్పడిన సంఘర్షణ ఏంటి అనే కథాంశంతో ఈ డానీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రా & రస్టిక్ నాటకం సినిమా తర్వాత కళ్యాణ్‌జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్‌పై అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Narnia: The Magician’s Nephew : హాలీవుడ్ సినిమా ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. సరికొత్త ప్రపంచంలోకి..

తాజాగా డానీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌ కూడా వైరల్ గా మారింది.