Narnia: The Magician’s Nephew : హాలీవుడ్ సినిమా ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. సరికొత్త ప్రపంచంలోకి..
తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. (Narnia: The Magician's Nephew)
Narnia: The Magician's Nephew
Narnia: The Magician’s Nephew : సీ.ఎస్. లూయిస్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ’. బార్బీ ఫేమ్ గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. మాయాజాలం, ఉత్కంఠ, అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఈ సినిమా 2027 ఫిబ్రవరి 12న భారతదేశంలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ సినిమాలో డేవిడ్ మెక్కెన్నా.. డిగరీ కిర్క్ పాత్రలో, బీట్రైస్ క్యాంప్బెల్.. పాలీ ప్లమ్మర్ పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి ప్రయాణం నార్నియా అనే మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎమ్మా మాకీ యువ జాడిస్ పాత్రలో, డేనియల్ క్రెయిగ్ అంకుల్ ఆండ్రూ పాత్రలో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే అనుకోకుండా ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఓ ఇద్దరు పిల్లలు తర్వాత జరిగే సంఘటనలను ఎలా ఎదుర్కొన్నారు, బయట ప్రపంచంలో ఇంకా ఎన్ని కొత్త ప్రపంచాలు ఉన్నాయి అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ పంపిణీ చేస్తోంది.
Also Read : Ramayana : రెండు వారాల ముందే ‘రామాయణ’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
మీరు కూడా నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ ట్రైలర్ చూసేయండి..
