Ashish3 : దెయ్యంతో కొత్త పెళ్ళికొడుకు ప్రేమాయణం.. ధైర్యం ఉంటే ప్రేమించు..

కొన్నిరోజుల క్రిందటే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు హీరో ఆశిష్.. ఇప్పుడు దెయ్యంతో కొత్త పెళ్ళికొడుకు ప్రేమాయణం నడపబోతున్నాడట.

Ashish Vaishnavi Chaitanya Horror thriller movie titled as Love Me

Ashish3 : టాలీవుడ్ స్టార్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ‘ఆశిష్’. మొదటి చిత్రంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రౌడీ బాయ్స్’ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన ఆశిష్.. యావరేజ్ టాక్ తో పర్వాలేదు అనిపించుకున్నారు. దీంతో నెక్స్ట్ సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని.. స్క్రిప్ట్ సెలక్షన్స్ లో కొంచెం లేటు చేశారు.

దాదాపు రెండేళ్ల తరువాత ఆశిష్ తన తదుపరి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే దర్శకుడు సుకుమార్ శిష్యుడైన కాశి దర్శకత్వంలో ఓ సినిమా, అరుణ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఆశిష్, అరుణ్ దర్శకత్వంలో చేస్తున్న తన మూడో సినిమా టైటిల్ ని నేడు ఆడియన్స్ కి తెలియజేసారు.

Also read : Rashmika Mandanna : రష్మిక భర్తకి అలాంటి క్వాలిటీస్ ఉండాలంట.. VD అంటూ అభిమాని చెప్తే..

ఈ సినిమాకి ‘లవ్ మీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఈ టైటిల్ కి ‘If You Dare (నీకు ధైర్యం ఉంటే)’ అనే ట్యాగ్ లైన్ ని పెట్టారు. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతుంది. టైటిల్ చూస్తుంటే.. ఈ సినిమాలో హీరో దెయ్యంతో ప్రేమాయణం నడపబోతున్నాడని అర్ధమవుతుంది. కొన్నిరోజుల క్రిందటే ఆశిష్ పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టైటిల్ చూసిన ఆడియన్స్.. దెయ్యంతో కొత్త పెళ్ళికొడుకు ప్రేమాయణం..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూనే.. మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

ఈ మోషన్ పోస్టర్ లోని విజువల్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో వెనుక లేడీ ఘోస్ట్ షాడోతో ఉన్న పోస్టర్ ఆసక్తిని కలిగిస్తుంది. కాగా ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ ఆమె ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ కూడా అలానే ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంటుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, స్టార్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు