Rashmika Mandanna : రష్మిక భర్తకి అలాంటి క్వాలిటీస్ ఉండాలంట.. VD అంటూ అభిమాని చెప్తే..

తాజాగా రష్మిక మందన్న ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో అభిమానులు చేసిన ట్వీట్స్ కి సరదాగా సమాధానాలు ఇచ్చింది

Rashmika Mandanna : రష్మిక భర్తకి అలాంటి క్వాలిటీస్ ఉండాలంట.. VD అంటూ అభిమాని చెప్తే..

Rashmika Mandanna wants these Qualities in her Husband like VD

Updated On : February 27, 2024 / 2:08 PM IST

Rashmika Mandanna : రష్మిక మందన్న తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే యానిమల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టింది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2 సినిమాతో పాటు ఇంకో అయిదు సినిమాలు ఉన్నాయి. ఇక నేషనల్ క్రష్ గా రష్మిక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 షూట్ లో బిజీగా ఉంది.

తాజాగా రష్మిక మందన్న ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో అభిమానులు చేసిన ట్వీట్స్ కి సరదాగా సమాధానాలు ఇచ్చింది. ఓ రష్మిక ఫ్యాన్.. రష్మికకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే.. రష్మిక నేషనల్ క్రష్ కాబట్టి ఆమె భర్త చాలా స్పెషల్ అయి ఉండాలి. ఆమె హస్బెండ్ VD లాగా ఉండాలి. VD అంటే వెరీ డేరింగ్ అని అర్ధం. ఆమెని కాపాడగలగాలి. రష్మిక క్వీన్ కాబట్టి, ఆమె భర్త రాజులా ఉండాలి అని పోస్ట్ చేసింది. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఇది చాలా నిజం అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Tanvi Negi : ‘యానిమల్’ కంటే ‘అర్జున్ రెడ్డి’నే బాగా నచ్చింది.. అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ అంతకుముందు రాలేదు..

అయితే ఈ ట్వీట్ లో VD అని స్పెషల్ గా పెట్టడం, దానికి రష్మిక రిప్లై ఇవ్వడంతో VD అంటే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, రష్మిక మధ్య ఏదో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని వార్తలు వచ్చినా కొన్ని సార్లు విజయ్ రష్మిక అవన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. కానీ ప్రతిసారి ఈ ఇద్దరూ ఏదో ఒక విషయంలో వైరల్ అవుతూనే ఉన్నారు, మీడియాకు చిక్కుతున్నారు. ఇప్పుడు VD అని పెడితే రష్మిక అవును నిజం అని రిప్లై ఇవ్వడంతో మరోసారి ఈ జంట వైరల్ గా మారారు.