Tanvi Negi : ‘యానిమల్’ కంటే ‘అర్జున్ రెడ్డి’నే బాగా నచ్చింది.. అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ అంతకుముందు రాలేదు..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన్వి నేగి యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Tanvi Negi : ‘యానిమల్’ కంటే ‘అర్జున్ రెడ్డి’నే బాగా నచ్చింది.. అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ అంతకుముందు రాలేదు..

Actress Tanvi Negi Interesting Comments on Arjun Reddy and Animal Movies

Updated On : February 27, 2024 / 10:49 AM IST

Tanvi Negi : నటి తన్వి నేగి ఇటీవలే సిద్దార్థ్ రాయ్(Siddharth Roy) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బోల్డ్ గా నటిస్తూనే, మరో పక్క ఓపిగ్గా భరించే ప్రేమికురాలిగా కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం సిద్దార్థ రాయ్ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన్వి నేగి యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Dil Raju : మరోసారి నటిస్తున్న దిల్ రాజు.. ఆ హారర్ సినిమాలో..

తన్వి నేగి మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి(Sandeep Reddy) సర్ వర్క్స్ నాకు బాగా నచ్చుతాయి. యానిమల్, అర్జున్ రెడ్డి రెండు సినిమాలు నేను చూసాను. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) అర్జున్ రెడ్డి(Arjun Reddy)లో అదరగొట్టేసారు. నాకు యానిమల్ సినిమా కంటే కూడా అర్జున్ రెడ్డి సినిమా బాగా నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతో సినిమాల్లో ఒక కొత్త వైబ్ ని సందీప్ రెడ్డి సర్ క్రియేట్ చేసారు. అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ అంతకుముందెప్పుడు రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి సినిమాలు వస్తున్నాయి. ఆ క్యారెక్టర్ ఎలాంటిది అని పక్కనపెడితే అలాంటివి కూడా సినిమాల్లో చూపించాలి అని తెలిపింది.

దీంతో తన్వి నేగి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యల్ని మరింత ప్రమోట్ చేస్తున్నారు.