Dil Raju : మరోసారి నటిస్తున్న దిల్ రాజు.. ఆ హారర్ సినిమాలో..

దిల్ రాజు గతంలో అంజలి నటించిన హారర్ కామెడీ సినిమా 'గీతాంజలి' సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

Dil Raju : మరోసారి నటిస్తున్న దిల్ రాజు.. ఆ హారర్ సినిమాలో..

Dil Raju will give Guest appearance in Horror Comedy Sequel Movie

Updated On : February 27, 2024 / 9:34 AM IST

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకెళ్తున్నారు. అయితే అప్పుడప్పుడు డైరెక్టర్స్, నిర్మాతలు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చి నటిస్తారు. దిల్ రాజు కూడా గతంలో అంజలి నటించిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారని సమాచారం.

గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా రాబోతుంది. ఇది నటి అంజలి 50వ సినిమా కావడం విశేషం. గీతాంజలి సినిమాలో నటించిన వాళ్లంతా ఈ సీక్వెల్ లో కూడా నటించారు. కోన వెంకట్ రచన, నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా ఆద్యంతం భయపెడుతూ నవ్వించింది. ఈ సినిమా మార్చ్ 22న రిలీజ్ కాబోతుంది.

Also Read : Aksha Pardasany : పెళ్లిపీటలు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి కొడుకు ఎంట్రీ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

మొదటి పార్ట్ లో దిల్ రాజు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడంతో రెండో పార్ట్ లో కూడా దిల్ రాజుని మూవీ మేకర్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వమని అడిగితే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో దిల్ రాజు కనపడనున్నారు. మరోసారి వెండితెరపై దిల్ రాజు సందడి చేయనున్నారు.

Also Read : Ambajipet Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

మరో వైపు నిర్మాతగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ తో పాటు శతమానం భవతి సీక్వెల్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్ స్థాపించి పలు చిన్న సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు సోదరుడు శిరీష్ పెళ్లి జరగడంతో గత కొన్ని రోజులుగా ఆ పెళ్ళి హడావిడిలో ఉన్నారు దిల్ రాజు.