Aksha Pardasany : పెళ్లిపీటలు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి కొడుకు ఎంట్రీ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

తాజాగా హీరోయిన్ అక్ష బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది.

Aksha Pardasany : పెళ్లిపీటలు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి కొడుకు ఎంట్రీ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Tollywood Actress Aksha Pardasany Married Bollywood Cinematographer Kaushal

Updated On : February 27, 2024 / 8:01 AM IST

Aksha Pardasany : తెలుగులో యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్, శత్రువు, రాధా, డిక్టేటర్.. లాంటి పలు సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ అక్ష పార్ధసాని తాజాగా ప్రేమ పెళ్లి చేసుకుంది. 2017 తర్వాత తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడంతో ఈ ముంబై భామ అక్కడే బాలీవుడ్ లో ఉంటూ అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.

తాజాగా హీరోయిన్ అక్ష బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్(Kaushal) ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల్ని ఒప్పించి తాజాగా నిన్న ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, స్నేహితుల మధ్యే ఈ వివాహం జరిగింది. పలు పెళ్లి ఫోటోలని అక్ష, కౌశల్ తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. అయితే ఈ పెళ్ళిలో పెళ్లి కొడుకు ఎంట్రీ వైరల్ గా మారింది.

Also Read : Shrutii Marrathe : ‘దేవర’ షూట్ లో జాయిన్ అయిన మరాఠీ భామ.. షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

సాధారణంగా పెళ్లి కొడుకులు గుర్రం లేదా కార్ లేదా రథం లాంటి వాటిల్లో కూర్చోపెట్టి ఊరేగింపుగా వస్తారు. అయితే కౌశల్ సినిమాటోగ్రాఫర్ కావడంతో షూటింగ్స్ కి వాడే కెమెరా క్రేన్ మీద కూర్చొని పెళ్లిలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవ్వగా.. కెమెరామెన్ అనిపించుకున్నాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్ష, కౌశల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు, పులువురు నెటిజన్లు, ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tollywood Actress Aksha Pardasany Married Bollywood Cinematographer Kaushal

 

Tollywood Actress Aksha Pardasany Married Bollywood Cinematographer Kaushal