Shrutii Marrathe : ‘దేవర’ షూట్ లో జాయిన్ అయిన మరాఠీ భామ.. షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

దేవరలో మరాఠీ భామ శృతి మరాఠే కూడా నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని ఆ భామే తెలిపింది.

Shrutii Marrathe : ‘దేవర’ షూట్ లో జాయిన్ అయిన మరాఠీ భామ.. షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

Shrutii Marrathe joined in NTR Devara Movie Shoot

Updated On : February 27, 2024 / 9:45 AM IST

Shrutii Marrathe : కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) హీరోగా ‘దేవర'(Devara) సినిమా రెండు పార్టులుగా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ రేంజ్ లో మాస్ గా ఉండబోతుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. దేవర పార్ట్ 1 సినిమాని మొదట ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఇంకా షూట్ అవ్వకపోవడంతో ఈ సినిమాని 10 అక్టోబర్ 2024లో రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవలే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనపడబోతున్నారు. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవరలో మరాఠీ భామ శృతి మరాఠే కూడా నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని ఆ భామే తెలిపింది.

Also Read : Mahesh Babu : RTC X రోడ్స్‌లో ఆ థియేటర్‌ని మల్టీప్లెక్స్‌గా మార్చేస్తున్న మహేష్ బాబు.. AMB క్లాసిక్‌గా..

శృతి మరాఠే దేవర షూటింగ్ లో జాయిన్ అయింది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో దేవర సినిమా కోసం వేసిన సెట్స్ లో ప్రస్తుతం ఈ షూటింగ్ జరుగుతుంది. శృతి మరాఠే దేవర సెట్స్ లో తన కారవాన్ లో సెల్ఫీ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి దేవర షూట్ అని తెలిపింది. దీంతో శృతి మరాఠే ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. శృతి మరాఠే మరాఠీ, తమిళ్ లో పలు సినిమాలు చేయగా ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

Shrutii Marrathe joined in NTR Devara Movie Shoot