Mahesh Babu : RTC X రోడ్స్‌లో ఆ థియేటర్‌ని మల్టీప్లెక్స్‌గా మార్చేస్తున్న మహేష్ బాబు.. AMB క్లాసిక్‌గా..

ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ ని ఇప్పుడు మహేష్ బాబు మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నారు.

Mahesh Babu : RTC X రోడ్స్‌లో ఆ థియేటర్‌ని మల్టీప్లెక్స్‌గా మార్చేస్తున్న మహేష్ బాబు.. AMB క్లాసిక్‌గా..

Mahesh Babu and Asian Cinemas want to Construct Multiplex in RTC X Roads

Updated On : February 27, 2024 / 7:12 AM IST

Mahesh Babu : ఇటీవల కాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తగ్గిపోతున్నాయి. కొంతకాలం కింద మెయింటైన్ చేయలేక మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఇప్పుడు మల్టీప్లెక్స్ లుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలంటే RTC X రోడ్స్ లోనే. అక్కడ ప్రతి శుక్రవారం పండగే. అక్కడ ఉన్న దేవి, సుదర్శన్, సంధ్య.. థియేటర్స్ ప్రతి శుక్రవారం బ్యానర్లు, పూల దండలు, హీరోల కటౌట్స్ తో నిండిపోతాయి. అభిమానులు అంతా అక్కడే తమ హీరోల సినిమాలని మొదటి రోజు చూడాలి అనుకుంటారు.

అయితే అదే ఏరియాలో 14 ఏళ్ళ క్రితం మూతపడిన ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ ని ఇప్పుడు మహేష్ బాబు మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నారు. RTC X రోడ్స్ లో సుదర్శన్ 35mm థియేటర్ వద్ద చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ థియేటర్ బాగానే రన్ అవుతుంది. అయితే గతంలో సుదర్శన్ 70mm(Sudarshan) థియేటర్ కూడా ఉండేది. దాన్ని 2010లోనే మూసేసారు. ఇప్పుడు ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకొని మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా AMB క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం.

Also Read : Priyanka Mohan : పవన్ కళ్యాణ్ గురించి ప్రియాంక మోహన్ కామెంట్స్.. తన ఫోన్ వాల్ పేపర్‌గా..

ఆల్రెడీ గచ్చిబౌలిలో వీరిద్దరూ కలిసి AMB మల్టీప్లెక్స్ కట్టగా అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. దీంతో ఇప్పుడు RTC X రోడ్స్ లో కూడా మల్టీప్లెక్స్ కడుతుండటం, ఆ ఏరియాలో సినిమాలకు ఉన్న హడావుడితో అక్కడ కూడా AMB సక్సెస్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు.