Priyanka Mohan : పవన్ కళ్యాణ్ గురించి ప్రియాంక మోహన్ కామెంట్స్.. తన ఫోన్ వాల్ పేపర్‌గా..

రీసెంట్ గా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ప్రియాంక మోహన్.. పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Priyanka Mohan : పవన్ కళ్యాణ్ గురించి ప్రియాంక మోహన్ కామెంట్స్.. తన ఫోన్ వాల్ పేపర్‌గా..

OG movie heroine Priyanka Mohan comments about Pawan Kalyan

Updated On : February 26, 2024 / 9:31 PM IST

Priyanka Mohan : అందాల భామ ప్రియాంక మోహన్.. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ని తన చేతిలో పెట్టుకున్నారు. నానితో ‘సరిపోదా శనివారం’, పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రాలను చేస్తున్నారు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో ట్రెడిషనల్ ఫోటోషూట్స్ తో అభిమానుల మనసు దోచుకుంటుంటారు. సోషల్ మీడియా ఫుల్ యాక్టీవ్ గా ఉండే ప్రియాంక.. రీసెంట్ గా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ చిట్ చాట్‌లో ఒక అభిమాని.. “ఫోన్ హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ ఏంటని?” ప్రశ్నించాడు. దానికి ప్రియాంక ఆ వాల్ పేపర్ ఫోటోని షేర్ చేస్తూ.. “మై ఫేవరెట్ హైసెన్‌బర్గ్” అంటూ బదులిచ్చారు. ఇక ఈ ఆన్సర్ చూసిన నెటిజెన్స్.. ప్రియాంక కూడా ‘బ్రేకింగ్ బ్యాడ్’ లవర్ అని తెలుసుకున్నారు.

OG movie heroine Priyanka Mohan comments about Pawan Kalyan

ఇక మరో అభిమాని.. “పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పండి” అంటూ ప్రశ్నించాడు. ఆ క్వశ్చన్ కి ప్రియాంక బదులిస్తూ.. “ఆయన ఒక లెజెండ్. అద్భుతమైన మనిషి. గొప్ప లీడర్. రియల్ పవర్ స్టార్” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ కి ఫుల్ ఖుషీ అయిన పవన్ అభిమానులు.. ఆ ఆన్సర్ ని స్క్రీన్ షాట్ చేసి వైరల్ చేస్తున్నారు.

Also read : Nani : నానికి తన కొడుకు అర్జున్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్.. పియానో పై మ్యూజిక్ ప్లే చేస్తూ..

OG movie heroine Priyanka Mohan comments about Pawan Kalyan

మరో అభిమాని.. “అక్క నువ్వు తడబడకుండా ఎన్ని భాషలు మాట్లాడగలవు?” అని ప్రశ్నించాడు. ఇక దానికి ప్రియాంక.. “తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్” అంటూ బదులిచ్చారు. ఈ ఆన్సర్ చూసిన నెటిజెన్స్.. ప్రియాంకకి ఇన్ని భాషలు వచ్చా అని ఆశ్చర్యపోతున్నారు.

OG movie heroine Priyanka Mohan comments about Pawan Kalyan

కాగా ఈ హీరోయిన్ చేసిన సినిమాలు మాట్లాడాలంటే.. చేతి వేళ్ళ పై లెక్కపెట్టి చెప్పేయొచ్చు. అయితే ఈ చిత్రాలతో ఈమె సంపాదించుకున్న అభిమానం మాత్రం లెక్కపెట్టలేనిదే. సెలెక్టివ్ గా సినిమాలు చేసే ప్రియాంక.. అందాలు ఆరబోయకుండా పాత్రకి ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు చేస్తూ వస్తుంటారు. ఈ భామలోని ఈ క్యారెక్టరే ఆడియన్స్ ని ఫిదా చేసి అభిమానులను చేసేలా చేసింది.