Nani : నానికి తన కొడుకు అర్జున్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్.. పియానో పై మ్యూజిక్ ప్లే చేస్తూ..

తన తండ్రికి బర్త్ డే గిఫ్ట్ గా నాని కొడుకు అర్జున్ ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా..?

Nani : నానికి తన కొడుకు అర్జున్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్.. పియానో పై మ్యూజిక్ ప్లే చేస్తూ..

Nani son Arjun gave wonderful birthday gift for his father

Updated On : February 26, 2024 / 8:16 PM IST

Nani : నేచురల్ స్టార్ నాని.. ఈ ఏడాది తన బర్త్ డేని చాలా స్పెషల్ గా చేసుకున్నారు. తన పుట్టినరోజుకి వరుస సినిమాల అప్డేట్స్ ఇచ్చి అభిమానులకు తానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఫుల్ ఖుషీ చేశారు. అయితే నాని తన అభిమానులను ఖుషీ చేస్తే.. తన వారసుడు అర్జున్ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి నానినే ఖుషీ చేశాడు. ఈ పుట్టినరోజుని నాని తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను నాని వైఫ్ అంజలి అభిమానులతో పంచుకున్నారు. వాటిలో అర్జున్ కి సంబంధించిన ఓ వీడియో అందర్నీ మెస్మరైజ్ చేసేస్తుంది. ఆ వీడియోలో అర్జున్ ఇలా మాట్లాడాడు.. “నాకిష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకనే ఈ బర్త్ డేకి గిఫ్ట్ గా నేను ఒక మ్యూజిక్ చేసి ఇస్తాను” అంటూ చెప్పి పియానో పై మ్యూజిక్ ప్లే చేశాడు.

Also read : Om Bheem Bush Teaser : సూపర్ హిట్ ట్రైయో ఈజ్ బ్యాక్.. ‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్..

ఇక ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజెన్స్ మాత్రమే కాదు.. కీర్తి సురేష్, ఆదా శర్మ వంటి సెలబ్రిటీస్ సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియో వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy)

కాగా నాని రీసెంట్ గానే అర్జున్ పియానో వాయిస్తున్న వీడియోని షేర్ చేసి తన కొడుకు టాలెంట్ ని అందరికి తెలియజేసారు. అయితే నాని అభిమానులు అర్జున్ టాలెంట్ ని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే, స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన నాని నుంచి.. హీరోగా మరో వారసుడిని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు అర్జున్ టాలెంట్ చూస్తుంటే.. అతను హీరోగా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా..? అనే సందేహం కలుగుతుంది.