Ambajipet Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

థియేటర్స్ లో సందడి చేసిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపొయింది.

Ambajipet Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పట్నుంచో తెలుసా?

Suhas Ambajipet Marriage Band Movie Streaming OTT Date full details here

Updated On : February 27, 2024 / 9:01 AM IST

Ambajipet Marriage Band : సుహాస్(Suhas), శివాని(Shivani) జంటగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమాలో నితిన్, శరణ్య, జగదీశ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. దాదాపు 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

థియేటర్స్ లో సందడి చేసిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపొయింది. ఆహా ఓటీటీలో మార్చ్ 1 నుంచి అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఆహాలో చూసేయండి.

Also Read : Aksha Pardasany : పెళ్లిపీటలు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి కొడుకు ఎంట్రీ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ఓ ఊళ్ళో అక్క తమ్ముళ్లు – ఆ ఊరి పెద్ద మధ్య జరిగిన ఆత్మగౌరవం పోరాటం, ఓ మంచి ప్రేమ కథ కలిపి ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో సుహాస్ తో పాటు సుహాస్ కి అక్కగా నటించిన శరణ్య అదరగొట్టేసింది. ఈ సినిమా తర్వాత శరణ్యకు బోలెడంత పేరు వచ్చింది.