Ashu Reddy Engagement : ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన అషు రెడ్డి.. పెళ్లి కొడుకెవరో తెలిస్తే ఫ్యూజులు కట్ అవుతాయి.. మరీ ఇంత అతా..!

Ashu Reddy Engagement : అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోల వెనక ఉన్న అసలు స్టోరీ తెర మీదకు వచ్చింది.

ashu reddy engagement Rumours photos video from web series scenes

Ashu Reddy Engagement : సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి పేరు గత కొన్ని రోజులుగా మీడియాలో మార్మోగిపోతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం కొనిపించుకుని.. చివరకు హ్యాండ్ ఇచ్చిందంటూ అషు రెడ్డి మీద కేసు ఫైల్ కావడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగానే.. అషు రెడ్డి ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి ప్రతి ఒక్కరికి షాకిచ్చింది. దీంతో అషుకి నిశ్చితార్థం జరిగిందా.. ఇంతకు ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు.. కేసు నడుస్తుండగానే.. ఇలా నిశ్చితార్థం ఎందుకు చేసుకుంది అంటూ జోరుగా చర్చించుకోసాగారు. కట్ చేస్తే 24 గంటల్లోగా ప్రతి ఒక్కరికి దిమ్మతిరిగే షాకిచ్చింది అషు రెడ్డి. తాజాగా అషు రెడ్డి తన ఎంగేజ్మెంట్ వీడియోని షేర్ చేసింది.

ఈ ఎంగేజ్మెంట్ వెనుక స్టోరీ ఏంటంటే.. ఎప్పటిలానే ఇదొక వెబ్ సిరీస్ లోని షూటింగ్ సీన్లు. వీటిని అషు రెడ్డి నిజంగానే తన ఎంగేజ్మెంట్ అన్న రీతిలో షేర్ చేసింది. ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలు షేర్ చేసింది, అయితే వాటిల్లో ఎక్కడా పెళ్లి కొడుకు ముఖం కనిపించలేదు. ఇక నేడు షేర్ చేసిన వీడియోలో అసలు వాస్తవం వెల్లడించింది. ఈ ఫోటోలు, వీడియోలు ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ (VOD) అనే వెబ్ సిరీస్ షూటింగ్ లోనివి. ఆ సీన్‌లో అషుతో పాటు ఉన్నది మరెవరో కాదు, బుల్లితెర నటుడు నిఖిల్ మలియక్కల్.

* రూ.9 కోట్ల మోసం.. అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. మధ్యలో వేణుస్వామి పేరు..

ఈ ఫోటోలతో పాటు అషు రెడ్డి “మన కళ్లతో చూసినవి, చెవులతో విన్నవన్నీ వాస్తవాలు అయి ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవంగా కనిపించే ప్రతిదీ నిజమైంది కాదు. ఏ విషయాన్ని అయినా నమ్మేముందు.. నిజానిజాలు తెలుసుకోండి” అంటూ గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలను లింక్ చేస్తూ.. తన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కాదనే ప్రయత్నం చేసింది అషు రెడ్డి. కానీ ఆమె ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజనులు మీరు ఎంత కవరింగ్ చేసుకోవాలని చూసినా.. నిజాలు అబద్ధాలు కావు.. మీ కవరింగ్ లు ఆపండి అంటూ ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు.

*రూ.9 కోట్ల మోసం.. స్పందించిన అషు రెడ్డి.. తప్పుడు వార్తలు రాస్తే జైలుకే అంటూ వార్నింగ్

కెరీర్ లో బిజీగా ఉన్న వేళ అషు రెడ్డి ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. లండన్‌కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి.. అషు రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టారు. ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన దగ్గర నుంచి రూ. 9.35 కోట్లు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలని ఆమె హైకోర్టును కోరినప్పటికీ, న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.