Ashu reddy Call Leaked: రూ.9 కోట్ల మోసం.. అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. ఎన్నారై ధర్మేంద్రకు బెదిరింపులు
తొమ్మిది కోట్ల స్కామ్ కేసులో నటి అషు రెడ్డి(Ashu reddy Call Leaked) ఆడియో కాల్స్ లీక్ అయ్యాయి.
ashu reddy audio calls leaked in 9 crore scam case
- అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.
- ఎన్నారై ధర్మేంద్రకు భారీ బెదిరింపులు.
- కోట్ల రూపాయల సెటిల్మెంట్ వివాదం.
Ashu reddy Call Leaked: పెళ్లి పేరుతో ఎన్నారై ధర్మేంద్రను మోసం చేసి రూ. 9.5 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి అషు రెడ్డి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా అషు రెడ్డికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ కాల్ రికార్డింగ్స్‌లో ఆమె ధర్మేంద్రను బాహాటంగా బెదిరించడం గమనార్హం.
Aamir Khan: పదేళ్ల తర్వాత ‘3 ఇడియట్స్ సీక్వెల్’.. ఆమీర్ ఖాన్ ఆసక్తికర ప్రకటన
తాను తీసుకున్న మొత్తంలో కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే ప్రస్తుతానికి ఇస్తానని, మిగిలిన డబ్బును జీవితంలో స్థిరపడిన తర్వాతే చెల్లిస్తానని ఆమె తెగేసి చెప్పారు. అంతేకాకుండా, తాను చెప్పినట్లు వినకపోతే వేధింపుల కేసు పెడతానని హెచ్చరించారు. తన అనుమతి లేకుండా ఇంటికి వచ్చి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ వివాదాన్ని ప్రవీణ, వేణు స్వామి వంటి పెద్దమనుషుల సమక్షంలో రాజీ చేసుకుందామని ప్రతిపాదించారు. ధర్మేంద్ర ముఖం చూడటం కూడా ఇష్టం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే, సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. మరోవైపు, ధర్మేంద్ర కారును ప్రమాదానికి గురిచేసిన అషు రెడ్డి(Ashu reddy Call Leaked) తల్లి, అతనికి క్షమాపణలు చెబుతున్న మాటలు కూడా ఈ ఆడియోలో రికార్డయ్యాయి. ఈ లీకైన రికార్డింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
