Poco X8 Power 5G : 10,000mAh బ్యాటరీతో కొత్త పోకో 5G ఫోన్.. దీపావళి సేల్‌లో బ్రహ్మాండమైన డిస్కౌంట్.. డోంట్ మిస్..!
Poco X8 Power 5G : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో పోకో X8 పవర్ 5Gపై భారీ డిస్కౌంట్. 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, HDFC బ్యాంక్ ఆఫర్‌తో ఫోన్ ధర, పూర్తి ఫీచర్లు తెలుసుకోండి.
Poco X8 Power 5G
- ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో పోకో ఫోన్ రచ్చ..
- భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే కెమెరా..
- 10,000mAh బ్యాటరీ ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే
Poco X8 Power 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా తరచూ ఛార్జింగ్ పెట్టుకునే బాధ లేకుండా లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు ఓ మంచి డీల్ రెడీగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో పోకో X8 పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ముఖ్యంగా 10,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది..
ధర ఎంతంటే? :
పోకో X8 పవర్ 5జీ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.35,999కు లభిస్తుంది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో ఈ ఫోన్ రూ.30,499కే అందుబాటులో ఉంది. అదనంగా HDFC బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.3వేలు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ పోకో ఫోన్ ధర రూ.27,499కు తగ్గుతుంది. ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ.8,500 వరకు ఆదా చేసుకోవచ్చు..
ఫీచర్లు మాత్రం అదుర్స్ :
ఈ ఫోన్లో 10,000mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాటరీ విషయంలో కంప్రమైజ్ అవ్వనివారికి ఇదే బెస్ట్ ఆప్షన్..
కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 అందించారు.
6.83 అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంది. IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. భారీ బ్యాటరీ, మంచి డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే కొనుగోలు చేసే ముందు బ్యాంక్ ఆఫర్లు, ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంత తగ్గిందో ఓసారి చెక్ చేయండి..
