Asian Tarakarama Theater : సీనియర్ ఎన్టీఆర్ థియేటర్.. త్వరలో రీ ఓపెనింగ్.. ఎక్కడో తెలుసా??
హైదరాబాద్ కాచిగూడలో తారకరామ అని ఒక పాత థియేటర్ ఉంది. చాలా ఏళ్లుగా ఈ థియేటర్ ని ఎన్టీఆర్ పేరుమీద నందమూరి ఫ్యామిలీ నడిపిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ థియేటర్ మూతబడే స్టేజికి వచ్చేసింది. దీంతో నందమూరి ఫ్యామిలీ ఆసియన్ గ్రూప్ తో కలిసి........
- Saketh U
- Published On : December 12, 2022 / 07:16 AM IST
Asian Tarakarama Theater re opening by balakrishna
Asian Tarakarama Theater : మన సినిమా వాళ్లకి వేరే బిజినెస్ లు కూడా ఉంటాయని తెలిసిందే. చాలా మంది ఇటీవల థియేటర్స్ మీద పెట్టుబడి పెడుతున్నారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఆసియన్ మల్టిప్లెక్స్ గ్రూప్ తో కలిసి మల్టిప్లెక్స్ థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన థియేటర్ ఒకటి ఉంది. హైదరాబాద్ కాచిగూడలో తారకరామ అని ఒక పాత థియేటర్ ఉంది. చాలా ఏళ్లుగా ఈ థియేటర్ ని ఎన్టీఆర్ పేరుమీద నందమూరి ఫ్యామిలీ నడిపిస్తుంది.
అయితే గత కొన్నేళ్లుగా ఈ థియేటర్ మూతబడే స్టేజికి వచ్చేసింది. దీంతో నందమూరి ఫ్యామిలీ ఆసియన్ గ్రూప్ తో కలిసి దీనిని రీ మోడలింగ్ చేసి మల్టిప్లెక్స్ లా చేశారు. ఇప్పటికే వర్క్ మొత్తం అయిపోయింది. ఆసియన్ తారకరామ పేరుతో ఈ థియేటర్ డిసెంబర్ 14న బాలకృష్ణ చేతుల మీదుగా గ్రాండ్ గా ఓపెన్ కానుంది. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి పలువురు నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.
BiggBoss 6 Day 98 : బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్జీవీ భామ..
కొత్త టెక్నాలజీతో ఈ థియేటర్ ని రీమోడల్ చేశారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. ప్రస్తుతం ఇందులో ఒకేసారి 590 మంది కూర్చొని చూడొచ్చు. డిసెంబర్ 16న రిలీజయ్యే అవతార్ సినిమాతో ఈ థియేటర్ లో స్క్రీనింగ్ మొదలుపెట్టనున్నారు.
