Vijay Babu : లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు.. ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తొలగింపు..
మలయాళ సినీ నటుడు, నిర్మాత విజయ్‌బాబుపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు కాగా ప్రస్తుతం విజయ్ పరారీలో ఉన్నాడు. తాజాగా అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్......
- Saketh U
- Published On : May 3, 2022 / 07:00 AM IST
Vijay
Vijay Babu : మలయాళ సినీ నటుడు, నిర్మాత విజయ్‌బాబుపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు కాగా ప్రస్తుతం విజయ్ పరారీలో ఉన్నాడు. విజయ్ పై ఇంకా పలువురు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ముద్దు పెట్టుకోబోయాడని, బలవంతం చేశాడని, సినీ అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పి లోబర్చుకోవాలనుకున్నాడని.. ఇలా విజయ్ బాబుపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఆరోపణలు చేశారు. దీంతో ఈ టాపిక్ కేరళ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.
తాజాగా అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ కమిటి నుంచి విజయ్ బాబును తొలిగించినట్లు ప్రకటన చేశారు. అంతేకాకుండా తాత్కలికంగా విజయ్ బాబు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు 5 మంది సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీ మీడియా సమావేశంలో తెలిపింది. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ తానే అసోసియేషన్ నుంచి తప్పుకుంటానని, తన వల్ల అసోషియేషన్ కి చెడ్డ పేరు రాకూడదని విజయ్ బాబు అసోసియేషన్ కి లేఖ రాసినట్టు సమాచారం. దీంతో అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్ విజయ్ బాబుని తొలగించారు.
Sarkaru Vari Paata : థియేటర్లో మహేష్ ఫాన్స్ రచ్చ.. థియేటర్ అద్దాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్..
అయితే పరిశ్రమలోని కొంతమంది మహిళలు అసోసియేషన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతను తప్పుకుంటానంటే మీరు తీసేయడమేంటి? అతనిపై చర్యలు తీసుకోరా అంటూ పలువురు అసోషియేషన్ ని ప్రశ్నించారు. విజయ్ బాబు విషయంపై మలయాళ ప్రముఖ నటులెవ్వరూ స్పందించకపోవడం విశేషం.
