Atrangi Re : టాక్ సూపర్‌హిట్.. కానీ అదొక్కటే మైనస్..
ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ నటించిన ‘అత్రంగి రే’ ఓటీటీలో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది..
- sekhar
- Updated on- December 24, 2021 / 01:11 PM IST
Atrangi Re
Atrangi Re: బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్, సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్, స్టార్ కిడ్ సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అత్రంగి రే’.. ‘తను వెడ్స్ మను’, ‘రాంజానా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేశారు.
Atrangi Re : పెళ్లయ్యాక పాత ప్రియుడితో ప్రేమ.. ట్రైలర్ అదిరింది..
‘అత్రంగి రే’ లో అక్షయ్ మెజీషియన్ క్యారెక్టర్లో నటించారు. సారా, అక్షయ్‌ని లవ్ చెయ్యడం.. అనుకోకుండా ధనుష్‌తో పెళ్లి జరగడం.. తిరిగి అక్షయ్‌ను కలసినా సరే సారా ధనుష్‌ను ఇష్టపడుతుండడం.. ధనుష్ కూడా ఆమెను ప్రేమిస్తుండడం.. ఇలాంటి వీళ్ల ముగ్గురు మధ్య ఏం జరిగిందనేది అసలు కథ..
Mammootty-Dulquer Salmaan : శివరాత్రికి తండ్రీ కొడుకులు ‘ఢీ’..
డిసెంబర్ 24 నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో ‘అత్రంగి రే’ స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ చేశారు మేకర్స్. 23 రాత్రి నుండే ప్రీమియర్ స్టార్ట్ అయ్యింది. సినిమా చూసిన వాళ్లంతా ‘ఇది సూపర్ ఎంటర్టైనింగ్ రొమాంటిక్ డ్రామా.. ప్యూర్ లవ్ అండ్ మ్యాడ్నెస్ విత్ ఎక్స్లెంట్ సాంగ్స్’ అంటూ ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్స్ అయితే 3.5 రేటింగ్ ఇచ్చారు. ‘అత్రంగి రే’ చాలా బాగుంది. థియేటర్లలో రిలీజ్ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. అదొక్కటే నిరాశ తప్ప సినిమాకి ఎలాంటి వంకా పెట్టక్కర్లేదని చెప్తున్నారు.
