Nick Jonas : పబ్లిక్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా భర్తపై లో దుస్తులు విసిరిన ఆడియన్స్..
తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి న్యూయార్క్ లోని ఓ స్టేడియంలో ఓ ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్ చేశారు.
- Saketh U
- Published On : August 14, 2023 / 09:41 AM IST
Audience threw inner clothes on Priyanka Chopra husband Nick Jonas at a public event
Nick Jonas : ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హాలీవుడ్(Hollywood) సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిక్ జోనస్ హాలీవుడ్ సింగర్(Singer) గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేసి తన పాటలతో ఆడియన్స్ ని మెప్పిస్తూ ఉంటాడు. తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి న్యూయార్క్ లోని ఓ స్టేడియంలో ఓ ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్ చేశారు.
అయితే ఈ మ్యూజిక్ ఈవెంట్ లో నిక్ జోనస్ కి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్ లో నిక్ జోనస్ పాడుతుండగా ఆడియన్స్ లో నుంచి ఒకరు లో దుస్తులు(బ్రా) నిక్ మీదకు విసిరారు. దీంతో నిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయినా వెంటనే తేరుకొని అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ పాడటం మొదలుపెట్టాడు. అయితే ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. నిక్ పై లో దుస్తులు విసిరిన వీడియో సోషల్ మీడియాలలో వైరల్ అయింది.
Rolex : ‘రోలెక్స్’ సినిమా ఫిక్స్.. సూర్యతో లోకేష్ కనగరాజ్ ఏకంగా రెండు సినిమాలు..
ఈ వీడియోపై పలువురు కామెంట్స్ చేస్తూ ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఇదెక్కడి అభిమానం, మీపై ఇలా విసిరితే ఊరుకుంటారా అంటూ ఫైర్ అవుతున్నారు. నిక్ అభిమానులు కూడా అలా చేసిన ఆడియన్ ని విమర్శిస్తున్నారు.
