Avengers: Doomsday : భారత్‌లో ఒక రోజు ముందే రిలీజ్ అవ్వబోతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’..

భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ ఒక రోజు ముందే ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. (Avengers: Doomsday)

  • Published on- October 28, 2026 / 01:18 PM IST

Avengers: Doomsday

Avengers: Doomsday : 2019లో వచ్చిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా అవెంజర్స్: డూమ్స్‌డే డిసెంబర్ 18, 2026న థియేటర్లలో రిలీజ్ కానుంది. మర్వెల్ సినిమాలకు ఇండియాలో కూడా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కలెక్షన్స్ బాగా వస్తాయి. అందుకే భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ ఒక రోజు ముందే ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు.

తాజాగా డాక్టర్ డూమ్‌గా చేసిన రాబర్ట్ డౌనీ జూనియర్, స్టీవ్ రోజర్స్‌గా చేసిన క్రిస్ ఎవాన్స్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా అమెరికా కంటే ఒక రోజు ముందుగా 17 డిసెంబర్ 2026న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

Also Read : Srinidhi Shetty : ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పింక్ చీరలో శ్రీనిధి శెట్టి మెరుపులు..

ఈ వీడియోలో మాట్లాడుతూ.. నమస్తే ఇండియా! దీపావళి అంటే ఒక అధ్యాయం ముగిసి, మరో కొత్త అధ్యాయం ప్రారంభం కావడం. ఈ విషయం గురించి మాకు బాగా తెలుసు. అయితే చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడానికి బదులుగా, ఈసారి బహుశా వెలుగు నుంచి చీకటివైపు ప్రయాణం సాగుతుందేమో! అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’లో కలుద్దాం అని అన్నారు. ఈ సినిమాలో మూడు విభిన్న విశ్వాలకు చెందిన అభిమాన హీరోలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఎదురెదురుగా నిలబడి ఎన్నడూ ఎదుర్కోని అత్యంత భయంకరమైన ముప్పును ఎదుర్కోబోతున్నారు.

ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కెవిన్ ఫైజ్, లూయిస్ డి’ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మిస్తున్నారు. ఒక రోజు ముందే అవెంజర్స్ సినిమా ఇండియాలో రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.