ప్రియుణ్ణి పరిచయం చేసిన చిన్నారి పెళ్లికూతురు!

  • Publish Date - November 12, 2020 / 05:24 PM IST

Avika Gor-Milind Chandwani: లాక్‌డౌన్ టైం లో సెలబ్రిటీలు ఎంచక్కా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. మరికొందరు తమ రిలేషన్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

ఇటీవలే పూనమ్ బజ్వా తన బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేయగా.. ఇప్పుడు చిన్నారి పెళ్లికూతురు.. అదేనండీ, అవికా గోర్ తన ప్రియుణ్ణి పరిచయం చేసింది.

మిలింద్ చంద్వానీతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు తెలుపుతూ అతనితో కలిసిఉన్న పిక్ షేర్ చేసింది. మిలింద్ చంద్వానీ క్యాంప్ డైరీస్ సీఈవో. గతకొద్ది రోజులుగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.


దీంతో వాటికి చెక్ పెడుతూ మిలింద్ పుట్టినరోజు సందర్భంగా అతినికి విషెస్ చెబుతూ తమ రిలేషన్ విషయాన్ని బయటపెట్టింది అవికా.

మిలింద్‌కు చెందిన ఓ ఎన్జీవో కోసం పనిచేస్తుండగా పలు సందర్భాల్లో వీళ్లు కలవడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట.

ఈ చిన్నారి పెళ్లికూతురు త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతుందేమో చూడాలి మరి.. కాగా తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ తో తెలుగు తెరకు పరిచయం అయింది అవికా గోర్.

తర్వాత ‘సినిమా చూపిస్తామావా, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది అవికా గోర్.