Baa Baa Black Sheep : ‘బా బా బ్లాక్ షీప్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విన్నారా..? దేవిశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి.. (Baa Baa Black Sheep)
- Saketh U
- Published on- August 15, 2026 / 06:35 PM IST
Baa Baa Black Sheep
Baa Baa Black Sheep : దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మాణంలో గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్’. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజారవీంద్ర.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాలయ రాష్ట్రంలో పూర్తిగా షూటింగ్ చేసిన మొదటి సౌత్ సినిమా ఇదే కావటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచు టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా ఓ సాంగ్ ని రిలీజ్ చేసారు.
ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సాంగ్ విని దేవిశ్రీప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇదొక పార్టీ సాంగ్. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ సంగీత సారథ్యంలో కిట్టు విస్సాప్రగడ ఈ పాటను రాయగా బెన్నీ దయాల్ పాడారు. ఇక ఈ సినిమాని దసరా సందర్బంగా అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : Selvamani : ఆమె అందరి మీద అరుస్తుంది.. రోజాపై భర్త సెల్వమణి కామెంట్స్ వైరల్..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. బా బా బ్లాక్ షీప్ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. దసరా సందర్భంగా అక్టోబర్ 9న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. మేఘాలయ రాష్ట్రంలో చిరపుంజితో పాటు అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం అని తెలిపారు.
