Babu Mohan : వాళ్లకు సంస్కారం ఉండాలి.. దరిద్రం వెంటపడి అట్టర్ ఫ్లాప్ అయింది.. ప్యారడైజ్ పై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా బాబు మోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్యారడైజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. (Babu Mohan)

  • Updated on- November 12, 2026 / 06:21 AM IST

Babu Mohan

Babu Mohan : ఇటీవల నాని హీరోగా ది ప్యారడైజ్ అనే సినిమా వచ్చి యావరేజ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. సీనియర్ కమెడియన్ బాబు మోహన్ కూడా ఉన్నారని, లుక్ టెస్ట్ చేసారని రిలీజ్ కి ముందు వార్తలు వచ్చాయి. తాజాగా బాబు మోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్యారడైజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

Also Read : Bigg Boss Family Week : బిగ్ బాస్ లోనే మొదటిసారి.. హౌస్‌లో నిశ్చితార్థం.. శివ – ప్రియాంక ఎమోషనల్.. ముకేశ్ తల్లితో వర్షిణి..

బాబు మోహన్ మాట్లాడుతూ.. ప్యారడైజ్ సినిమాలో పాత్ర కోసం నన్ను పిలిచారు. నాకు గెటప్ వేసారు. మేకప్ వేసి లుక్ టెస్ట్ చేశారు. ఫస్ట్ టైం నాకు మేకప్ టెస్ట్. కానీ షూటింగ్ కి నన్ను పిలవలేదు. గెటప్ వేసి బ్రహ్మాండం అన్నారు. షూట్ ఉన్నప్పుడు పిలుస్తాం అన్నారు. సినిమాలో ఎందుకు లేనో నాకు తెలిదేసు. నేను పనికిరాను అనుకున్నారేమో. నాకంటే బెస్ట్ యాక్టర్స్ దొరుకుతారు అనుకున్నారేమో. దరిద్రం వాళ్ళ వెంటపడి, శని వెంటపడి సినిమా ప్లాప్ అయ్యింది. లక్కీ లెగ్ బాబు మోహన్ ది. ఈ సినిమా ఫ్లాప్ కావాలని రాసారేమో. ఒక్కరోజు కూడా ఆడలేదు. అందరు డైరెక్టర్స్ నాకు మంచి మంచి పాత్రలు ఇచ్చారు. ఈ ప్యారడైజ్ ఇవ్వకపోతే నేను ఫీల్ అవుతానా. అందుకే భగవంతుడు ఆ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేసాడు.

ఇలా పిలిచి టెస్ట్ చేసి క్యారెక్టర్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. నావి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవి చూసి కావాలనుకుంటే మా లాంటి వాళ్ళను పిలవాలి. అది న్యాయం. కానీ పిలిచి మేకప్ వేసి, నా కన్ను మీద గాజు కన్ను పెట్టి టెస్ట్ షూట్ చేసారు. చాలా కష్టపడ్డాను దాని కోసం. వాళ్లకు నేను కోపరేట్ చేశా. అయిదారు డ్రెస్ లు వేసి చూసారు. కనీసం ఒక్క షాట్ లో అయినా పెట్టాలి కదా. కనీసం కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని పెట్టలేదు అని చెప్పాలి కదా ముందు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సినిమా రిలీజ్ అయ్యేదాకా నన్ను పిలుస్తారనే అనుకున్నా. ఎదురుచూసాను. వాళ్లకు సంస్కారం ఉండాలి. రెండు రోజుల్లో రిలీజ్ అని టీవిలో చూసా. ఓ రిలీజా అని నాకు అప్పుడు తెలిసింది. రిలీజయిన రెండు రోజులకు డబ్బాలు వెనక్కి వచ్చాయి అట్టర్ ఫ్లాప్ అన్నారు సరిపోయిందిగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి దీనిపై ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కానీ, నాని కానీ స్పందిస్తారేమో చూడాలి.