Sai Rajesh : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బేబీ (Baby) సినిమా ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి స్పూఫ్ చిత్రాలు తెరకెక్కించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీలో ఆనంద్ కంటే ముందుగా మరో టాలీవుడ్ యంగ్ హీరోకి కథ వినిపించడానికి ట్రై చేశారట. కానీ ఆ హీరో.. “హృదయ కాలేయం తీసిన డైరెక్టరా? అయితే కథ కూడా విననని” అని బదులిచ్చాడట. ఈ విషయాన్ని సాయి రాజేశ్ ఇటీవల పలు సక్సెస్ మీట్స్ లో చెప్పుకొచ్చాడు.
Jailer : రజినీకాంత్ జైలర్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యామిలీ మ్యాన్ యాక్షన్..
అలా అవమానించిన హీరో ఎవరో కాదు విశ్వక్ సేన్ (Vishwak Sen). అయితే సాయి రాజేశ్ ఎన్ని సక్సెస్ మీట్స్ లో మాట్లాడిన విశ్వక్ పేరు ఎక్కడ బయటపెట్టలేదు. కానీ ఈ డైరెక్టర్ ఒక ఈవెంట్ లో మాట్లాడిన కొంతసమయానికి విశ్వక్ కొన్ని పోస్టులు వేయడంతో.. ఆ హీరో తానే అని తెలిసింది. దీంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ వస్తుండడంతో ఇటీవల విశ్వక్ కూడా ఒక ఈవెంట్ లో రెస్పాండ్ అయ్యాడు. “ఒక సినిమా చేయడం, చేయకపోవడం నా పర్సనల్. ఇప్పుడు మీకు హిట్టు వచ్చింది కదా అని, ఇలా ఎదుట వాడిని కించపరచడం సరి కాదు” అంటూ వ్యాఖ్యానించాడు.
Sitara : లండన్ వీధుల్లో సందడి చేస్తున్న సితార.. ఫోటోలు చూశారా..?
ఇక ఈ మొత్తం కాంట్రవర్సీ పై సాయి రాజేశ్ డైరెక్ట్ గా మాట్లాడాడు. “నేను ఆయన్ని అవమానించడానికే ఎక్కడా ఆయన పేరు చెప్పలేదు. అలా చేయాలనీ కూడా నా ఉద్దేశం కాదు. నా దగ్గర ఒక కథ ఉందని చెబుతూ గీతాఆర్ట్స్ వారు విశ్వక్ ఫోన్ చేసినప్పుడు.. ఆయన ఏదైతే అన్నాడో అవి నాకు మాట మార్చకుండా చెప్పారు. సినిమా చేయడం చేయకపోవడం అది అయన ఇష్టం దానిని నేను అర్థంచేసుకోగలను. కానీ తిరస్కరణ అనేది కూడా మర్యాదపూర్వకంగా ఉంటే బాగుటుంది. ఆయన విషయంలో నాకు అదే బాధ అనిపించింది” అంటూ పేర్కొన్నాడు.